ముసుగు తొలగింది

చంద్రబాబు చాలా సార్లు తన పాలన గురించి మనకి
హింట్ ఇస్తుంటాడు. తనది రాజకీయ పాలన అంటుంటాడు. దాని అర్థం రాజనీతి తెలిసిన
నాయకుడు చేసే పాలన అని కాదు, రాజకీయాలు మాత్రమే చేసే పాలన అని అర్థం. ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలి, అవినీతిలో మునిగితేలడం, నీచ రాజకీయ సంస్కృతులకు
తెరతీయడమే బాబు రాజకీయ పాలన. ప్రభుత్వాన్ని ఎన్ని విధాల భ్రష్టు పట్టించే అవకాశం
ఉందో అన్నివిధాలనూ వాడేస్తున్నాడు బాబు. ఏ ముఖ్యమంత్రీ  చేయనన్ని కంత్రీ వ్యవహారాలను తెరవెనుక గుట్టు
చప్పుడు కాకుండా చేసేస్తున్నాడు. ముసుగేసి మరీ బాబు చేసే ఈ వ్యవహారాల గుట్టు
ఇప్పుడిప్పుడే బైట పడుతోంది. బాబు బాగోతాలను బైట పెడుతోంది. ప్రభుత్వోద్యోగులను
సైతం తన రాజకీయ ప్రచారాస్త్రంగా వాడుకోవడం చంద్రబాబు పాలనలోనే చూడగలం. అందుకోసం చంద్రబాబు
ఎంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడో చూస్తే ఔరా అనక ఉండలేం.

నిన్నటిదాకా అశోక్ బాబు అనే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల
సంఘం నాయకుడు చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ, రాష్ట్ర ఉద్యోగుల ప్రయోజనాలన్నీ
తాకట్టు పెట్టేశాడు. బాబు పెరటి మొక్కల్లో, పెట్స్ లో అశోక్ బాబు ఒకడన్న సంగతి  మరోసారి బహిరంగంగా రుజువైంది. దాంతోపాటే
చంద్రబాబు విషపు కోరలు పరిపాలనా విభాగాలను ఎలా నాశనం చేయనున్నాయో కూడా బహిర్గంతం
అవుతోంది. నిన్నటిదాకా రహస్యంగా సాగిన ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు,
చంద్రబాబుల మైత్రి ముసుగు తొలగిపోయింది. పొరుగునే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల
వేళ, తాజాగా విడిపోయిన బిజెపికి వ్యతిరేకంగా, కొత్తగా జట్టు కట్టిన కాంగ్రెస్ కు
అనుకూలంగా ప్రచారం చేసేందుకు అశోక్ బాబును పంపించారు. తెలుగు సంఘాల మీటింగ్ అంటూ
మొదలుపెట్టి ఓట్ల రాజకీయాలకు తెరతీయడంతో అక్కడి తెలుగు వారు కొందరు దీన్ని
వ్యతిరేకించారు.

ప్రభుత్వోద్యోగులా... టిడిపి ప్రచారకులా

ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు టిడిపి ప్రభుత్వ
సిద్ధాంతాల ప్రకారం కర్ణాటకలో ప్రచారం చేస్తున్నాడు. బాధ్యతగల ఓ ప్రభుత్వోద్యోగి
అయ్యుండీ, ఓ రాజకీయ పార్టీ తరఫున ప్రచారానికి, అందులోనూ పక్కరాష్ట్రానికి వెళ్లి
మరీ మీటింగులు పెట్టడాన్ని ఎలా నిర్వచించాలి? బాబు అధికార దుర్వినియోగానికి ఇదో
పరాకాష్ట. పరిపాలనా విభాగంలో రాజకీయ జోక్యాన్ని పెంచే విష సంస్కృతికి ముమ్మాటికీ
చంద్రబాబే కారకుడు. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ని కూడా తుంగలో తొక్కుతూ అశోక్ బాబు
ఇలా బరితెగించడం వెనుక ఎపి ప్రభుత్వమే వెన్నుదన్నుగా ఉంది. ఆయన ఫ్లైట్ ఛార్జీల
నుంచి మొదలుకొని హోటల్ ఛార్జీల వరకూ అన్నీ ప్రభుత్వమే భరించి కర్ణాటకకు పంపడం
వెనుక ఆంతర్యం ఇదే. ఎపి ఎన్టీవో సంఘం నాయకుడు అశోక్ బాబు గతంలో చంద్రబాబు పిలిచిన
అఖిలపక్షానికి వచ్చి బేషరుతుగా బాబు కు మద్దతు పలికాడు. భవిష్యత్ లో
ఉద్యోగులందరినీ అధికారికంగా పార్టీ ప్రచారానికి వినియోగించుకున్నా
ఆశ్చర్యపోనక్కర్లేదేమో!! ఇంక్రిమెంట్లు, పదోన్నతులు ఆపేస్తామని బెదిరించి
ఉద్యోగులను, హోదాలు పెంచుతామని అధికారులను, బదిలీల బూచి చూపి ఐఎఎస్, ఐపిఎస్ లను
కూడా టిడిపి ప్రచారానికి వాడుకోవాలని చంద్రబాబు ప్లానులా ఉంది. 

Back to Top