ఐక్యరాజ్యసమితి పేరుతో చంద్రబాబు మోసం


మరోసారి బాబు బురిడీ కబుర్లు మొదలయ్యాయి. టిక్కెట్లు కొని సదస్సులకు హాజరౌతూ అదేదో అంతర్జాతీయ వేదికలపై ముఖ్యమంత్రికి ఆహ్వానం అంటూ ప్రచారం చేయించుకునే టిడిపి అధినేత ఇప్పుడేకంగా ఐక్యరాజ్యసమితి పేరునే ప్రచారం మొదలెట్టారు. ఐక్యరాజ్యసమితి కార్యాలయం నుంచి ఆహ్వానం అందిందని చెబుతున్న విషయంలో సిఎమ్ఒ చెబుతున్నదానికి ఐక్యరాజ్యసమితి అఫిషియల్ వెబ్ సైట్ లో ఉంచిన సమాచారానికి పొంతన లేకుండా ఉంది. అక్కడ కార్యక్రమాల జాబితాలో బాబు పేరే లేదు. కానీ ఐక్యరాజ్యసమితి ప్రధాన భవనంలోనే సదస్సు అంటూ ఊదరగొట్టేస్తున్నారు బాబు భజన బృందాల వారు. అయితే బాబుగారి అమెరికా పర్యటనలో మధ్యరోజు ప్రకృతి వ్యవసాయంపై బాబుగారి ప్రసంగం ఉంటుందట. మరి అటు ఇటు ఉన్న రెండు రోజుల్లో ఆయన చేయబోతున్నదేమిటీ అంటే ... ఆ విషయం బాబుగారు ఫ్లైట్ దిగిన క్షణంలోనే అర్థం అయిపోయింది. ఎన్నారైలంతా బాబును స్వాగతిస్తూ తీసుకెళ్లినప్పుడే ఇది రాబోయే ఎన్నికల ప్రచారానకే విషయం క్లియర్ గా తెలిసిపోతోంది. పనిలో పనిగా పెట్టుబడిదారులతో సమావేశాలు. అంటే మరోసారి బాబుగారు తన కోట్ల రూపాయిల పెట్టుబడులు రాష్ట్రానికి తేవడం అనే సిరీస్ కథను మరోసారి వల్లె వేస్తారన్నమాట. 
ఇంతకీ బాబుగారు కీలకోపన్యాశం చేస్తున్న అంశం సుస్థిర వ్యవసాయానికి ఆర్థీక చేయూత, అంతర్జాతీయ సవళ్లూ అనే అంశాలపైనట. పైగా ప్రకృతి వ్యవసాయంలో చంద్రబాబు గారు సాధించిన ఫలితాలను చూసి ఈ ఆహ్వానం అందిందట. కానీ చంద్రబాబుగారికి వచ్చిన ఆహ్వానం ఐక్యరాజ్యసమితి పంపినది కాదని...కనీసం దాని అనుబంధ సంస్థది కూడా కాదని అంటున్నారు అంతర్జాతీయ వార్తా విశ్లేషకులు. వల్డ్ ఎకనామిక్ ఫారం అనే స్వచ్ఛంద సంస్థ బ్లూమ్ బర్గ్ అనే మరో వాణిజ్య సంస్థతో కలిసి చేస్తున్న సమావేశమే ఇది అని అంటున్నారు. దీనికీ ఐక్యరాజ్యసమితికి సంబంధం లేదని, ఇది కనీసం ఐరాసా భాగస్వామ్య సంస్థ కానీ, ప్రభుత్వ సంస్థ కానీ కాదని చెబుతున్నారు. దీన్ని ఐక్యరాజ్య సమితి ఆహ్వానంగా ప్రకటించడం ద్వారా రాష్ట్రం పరువును అంతర్జాతీయ స్థాయిలో బజారున పెడుతున్నారని విమర్శిస్తున్నారు. బాబు కీర్తికాంక్షకు చివరకు రాష్ట్రం పరువు కూడా గంగపాలౌతోందంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు. 
 
Back to Top