రెండు ట్వీట్లు ఆరు కోట్లు

సోషల్ మీడియా ప్రచారం కోసం
కోట్ల రూపాయిలు

సిఎమ్ ట్విట్టర్, ఫేస్ బుక్
ఎక్కౌంట్ల నిర్వహణ ఖర్చు
6 కోట్లు

ప్రజాధనానం అంటే బాబుకు
పప్పు బెల్లమే

 

అనవసరపు ఖర్చులు చేయకండి, రాష్ట్రం
అసలే క్లిష్టపరిస్థితుల్లో ఉంది అంటారు చంద్రబాబు అధికారులను. కానీ ఆయన
మాత్రం అంతులేని వేస్టేజికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు. ప్రచారాలకోసం, ప్రయాణాల
కోసం, డాబులు-దర్పాల కోసం బాబు పెట్టే ఖర్చుకు అంతు లేదు. ప్రజల సొమ్మును
పాకెట్ మనీలా విచ్చిలవిడిగా వాడేయడం బాబుకు అలవాటు. ఇన్నాళ్లూ
ప్రత్యేక విమానాలు, విందులు, విలాసాలకే అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా లో బాబుగారి రెండు
ఎక్కౌంట్లు నడపడానికి ఏడాదికి 6 కోట్లు వెచ్చిస్తున్నారన్న సమాచారం బైట పడింది.
Hubilo అనే సోషల్ నెట్వర్కింగ్ ఏజెన్సీకి ఏటా 6 కోట్లు ప్రభుత్వ
ఖాతా నుంచి పోతున్నాయి. వాళ్లు చేసే పనల్లా రోజూ చంద్రబాబు ట్విట్టర్, ఫేస్ బుక్
ఎక్కౌంట్లను నిర్వహించడం.

ముక్కున వేలేసుకోకండి ఇంకా అయిపోలేదు. Group M అనే మరో
ఇమేజ్ బుల్డింగ్ ఏజెన్సీ కి కూడా సంవ్సరానికి 25 కోట్లు ధారబోస్తున్నారు. ప్రభుత్వ
పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రమోట్ చేయడానికి ఈ ఏజెన్సీకి ఇంత మొత్తంలో
ఖర్చుచేస్తున్నారు. ఇంతా చేస్తే బాబుగారి ఎక్కౌంట్లు చూస్తున్న Hubilo ఏజెన్సీ
రోజుకు 2 ట్వీట్లు పోస్టు చేస్తోంది. అవి కూడా
ఏమాత్రం పసలేనివి. ఇక Group M ఏజెన్సీ చేస్తున్న ప్రమోషన్ల వల్ల కూడా ఎక్స్ ట్రా మైలేజేమీ
కనిపించడం లేదు.

గతంలోనూ చంద్రబాబు
మీడియాను మేనేజ్ చేయడం ద్వారానే తన ప్రభుత్వానికి, తనకూ గొప్ప
మైలేజీ సంపాదించుకున్నారు. ఈసారి మాత్రం
మీడియా హ్యాండిలింగ్, పిఆర్ మేనేజ్ మెంటును ప్రైవేటు ఏజెన్సీలకు
అప్పగించారు. Hubilo, Group M కాకుండా మరో
160 మంది ప్రొఫెషనల్స్
కాంట్రాక్టు పద్ధతిమీద వివిధ అంశాలకోసం పనిచేస్తున్నారు. అయితే ఇన్ని
ప్రయత్నాల తర్వాత కూడా మీడియాలో టిడిపి ప్రభుత్వం, చంద్రబాబుకు
అనుకూలంగా పాజిటివ్ ఫలితాలు రావడం లేదు. పెయిడ్ మీడియా
ద్వారా చేయించుకుంటున్న ప్రచారం ఆశాజనకంగా లేదు. ఈ మీడియా సంస్థల
ప్రచారాలు ప్రజల మీద ఎలాంటి ప్రభవాన్నీ చూపలేకపోయాయి. అందుకు కారణం
వారి పోస్టుల్లో ప్రాంతీయత, స్థానికతకు
సంబంధించిన విషయాలేవీ లేకపోవడమే. రాష్ట్రంలో
జరుగుతున్న పరిణామాలు, దాని పూర్వాపరాలు ఏవీ తెలియని ఈ
హై స్టాండర్డ్ ఏజెన్సీలు నామమాత్రంగా తమ విధులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నాయి. ప్రచారం కోసం
బాబు పడే తాపత్రయం మీద ఈ ఏజెన్సీలు చల్లనీళ్లు జల్లుతున్నాయనే అనుకోవాలి. ఆర్భాటాలు, ప్రచారాల ద్వారా
తమ అసమర్థతను కప్పిపుచ్చుకుని, నాలుగేళ్లుగా
ఏమీ చేయని ప్రభుత్వాన్ని అద్భుత పరిపాలనగా అభివర్ణించుకుని మరోసారి అధికారం చేజిక్కించుకోవాలన్న
చంద్రబాబు ఆశలకు ఖజానా ఖాళీ అవుతోంది. ప్రజాధనం పెద్ద
ఎత్తున దుర్వినియోగం అవుతోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top