బాబు అండ్ కో రెండు కళ్ల సిద్ధాంతం..?

  • ఇక్కడ హోదా వద్దు.. అక్కడ హోదా ముద్దు
  • ఆదాయం ఉంటే ఒకమాట లేకపోతే మరోమాట
  • రాజధాని ముసుగులో లక్షల కోట్ల వ్యాపారాలు
  • ప్రజలు ఏమైపోయినా వాళ్లు పట్టించుకోరు
  • 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన  ప్రత్యేక హోదాను నీరుగార్చారు
  • నమ్మిన రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారు
చంద్రబాబు నాయుడి రెండు నాల్కల సిద్ధాంతం గురించి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు టీడీపీ నాయకులు. అంతేకాదు తమకు ఆదాయం వస్తోందంటే ఏ పని చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదా విషయంలో అంతేచేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి హోదాను నీరుగార్చారు. బాబుతో పాటు ఆ పార్టీ నాయకులు హోదా విషయంలో రెండు నాల్కల ధోరణితో ఎలా మాట్లాడారో తెలుసుకుంటే వాళ్లపై అసహ్యం కలగక మానదు. 

ప్రత్యేక హోదా విషయం గురించి మాట్లాడాల్సి వస్తే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నలుగురి గురించి మాట్లాడాలి. చంద్రబాబుతో పాటు సుజనా చౌదరి, సీఎం రమేశ్, గల్లా జయదేవ్‌. వీళ్లందరూ రాజకీయ నాయకులు. అంతకంటే ఎక్కువగా బడా పారిశ్రామిక వేత్తలు కూడా. వీళ్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పార్ట్‌ టైం రాజకీయం.. ఫుల్‌టైం వ్యాపారం అన్నట్లుగా కొనసాగుతున్నారు. అయితే ఏపీకి హోదా వస్తే క్రెడిట్‌ ప్రతిపక్ష వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌కు వెళ్తుందనుకున్నారో ఏమో కానీ.. హోదా రాకుండా అడ్డుకుంటున్నారు. 

అప్పుడు హోదా తమతోనే సాధ్యమన్న తమ్ముళ్లు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా 10 ఏళ్లు కాదు.. 15 ఏళ్లు తెస్తామని గొప్పలు చెప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత, నాయకులు తర్వాత కాలంలో హోదాను గాలికొదిలేశారు. ప్రతిపక్షం ఎప్పుడైతే ప్రత్యేక హోదా డిమాండ్‌ను జనాల్లోకి తీసుకెళ్లిందో అప్పటి నుంచి పచ్చనేతలు డ్రామాలు మొదలుపెట్టారు.  క్రెడిట్‌ అంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు ఎక్కడ వెళ్తుందోనని హోదా తమతోనే సాధ్యమని, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. అలా దాదాపు రెండేళ్లపాటు నాటకాన్ని రక్తి కట్టించి... ప్రజల్లో  ఇక హోదా రాదనే భావన కలిగించి  హోదాకంటే ఎక్కువ ప్యాకేజీ తెస్తున్నామని, కేంద్రంపై గట్టిగా పోరాడి ఇది ఒప్పించామని డబ్బా కొట్టుకున్నారు. 

హోదాతో ప్రయోజనం ఉండదంటూ అసత్య ప్రచారం
‘‘ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది? హోదాతో ఏం ప్రయోజనం? ఇప్పటి వరకు హోదా కలిగిన రాష్ట్రాలు ఏం అభివృద్ధి సాధించాయి? ’’ అంటూ చంద్రబాబు అసత్య ప్రచారం మొదలు పెట్టారు. బాబు తానా అంటే నాయకులు..కొన్ని మీడియా ఛానళ్లు తందానా అంటూ అసత్య ప్రచారాన్ని మొదలు పెట్టాయి. హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అబద్ధాలు చెబుతోందని, హోదాతో ఎలాంటి లాభం లేదంటూ పచ్చపార్టీ నేతలు గ్లోబెల్స్ ప్రచారం చేశారు. హోదాకంటే ఎక్కువగా ప్యాకేజీ తెస్తామని, ప్యాకేజీతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ మీడియాలో ఊదరగొట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ అండదండలతో రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని,  ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమలను మూత వేయిస్తున్నారు బాబు. 

అక్కడో మాట... ఇక్కడో మాట!
తెలుగుదేశం పార్టీలోని చాలా మంది నేతలు రెండు నాల్కల సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నారు. ఒకసారి ప్రత్యేక హోదా కావాలని.. మరోసారి హోదాతో ఏం ప్రయోజనం ఉండదని మాట్లాడుతున్నారు. తమ నాయకుడు కేంద్రంతో మాట్లాడి ప్యాకేజీ తెస్తున్నారని, దీంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అంటున్నారు. అయితే హోదాతో ఏం లాభం ఉండదంటున్న ఈ నేతలే హోదా కలిగిన రాష్ట్రాల్లో తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటుండడం గమనార్హం.  

వీటికి ఏం సమాధానం చెబుతారు?
ప్రత్యేక హోదా వల్ల లాభం వట్టిమాటేనని అదేపనిగా ఊదరగొడుతున్న పచ్చపార్టీ నేతలు  ఇప్పటికే  ప్రత్యేక హోదా కలిగివున్న ఉత్తరాఖండ్‌లో మాత్రం ఆ సదుపాయాలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించగా ఆ ప్రయోజనాలు పొందడంలో ముందున్న వారు మళ్లీ ఈ చంద్రబాబు, సుజనా చౌదరి, సీఎం రమేష్, గల్లా జయదేవ్‌లే.  మంత్రి సుజనా చౌదరి ఆయనకు సంబంధించిన న్యూలాండ్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఉత్తరాఖండ్‌లో ఫ్యాన్ల తయారీ యూనిట్‌ నెలకొల్పింది. ఆ కంపెనీ చైర్మన్‌ హోదాలో  సుజనా చౌదరి 2006లో విడుదలచేసిన నివేదికలో ప్రత్యేక హోదా వల్ల  కలుగుతున్న ప్రయోజనాలను సవివరంగా పొందుపరిచారు. ఎక్సైజ్‌ డ్యూటీ, ఆదాయపు పన్ను, కేంద్ర సర్వీస్‌ టాక్స్‌ వంటివి ఉండకపోవడం వల్ల ఉత్పత్తికి విస్తరణకు మంచి అవకాశాలున్నాయని అందులో పేర్కొన్నారు. ఇక సీఎం రమేష్‌ విషయానికి వస్తే ఉత్తరాఖండ్‌లో నార్త్‌ ఈస్ట్రన్‌ పవర్‌ ప్రాజెక్ట్సులో రూ. 69 లక్షలు పెట్టుబడి పెట్టానని తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక తెలుగుదేశంలో చేరి గుంటూరు ఎంపిగా గెలిచిన యువ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీస్‌ కంపెనీ కూడా ఉత్తరాంచల్‌లో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు భూమి కొనుగోలు చేశారు. ఈ జాబితాలో మరికొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, బాబు బినామీలు చాలా మంది ఉన్నట్లు సమాచారం. మరి ప్రత్యేక హోదాతో ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్న ఈ నేతలు అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టారో సమాధానం చెబితే బాగుంటుంది. 

హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా చెప్పినా నేటికీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. హోదా తెస్తామని.. ఇస్తామని చెప్పిన పార్టీలు..నేతలు కూడా ప్రజలను మోసం చేశారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుకు పైగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తూనే ఉంది. హోదాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తోంది. ఎప్పటికీ సాధ్యం కాదనుకున్న ప్రత్యేక తెలంగాణనే సాధించుకున్నప్పుడు.. పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చిన హోదా సాధించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని 
Back to Top