పట్టిసీమ ప్రారంభోత్సవం లోని మతలబు ఇదే.. !


() సరిగ్గా ఏడాది క్రితం మొదలైన పనులు

() ఒక సంవత్సరంలో పూర్తయితేనే అదనపు చెల్లింపులు

() అందుకే హడావుడిగా ప్రారంభోత్సవం చేసిన చంద్రబాబు

హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా పట్టిసీమ కు ప్రారంభోత్సవం
చేయటానికి గల కారణం బయట పడింది. ఏడాదిలోగా పనులు పూర్తయ్యాయ  అని పిస్తేనే కాంట్రాక్టర్లకు అదనంగా దోచి
పెట్టడానికి వీలవుతుంది. అందుకే హడావుడిగా పని కానిచ్చేశారు అన్న మాట
వినిపిస్తోంది.

మొదట నుంచీ అవినీతి సుగంధమే..!

పట్టి సీమ పథకం ఆవిర్భావమే అవినీతి తో మొదలైంది. తెలుగువారికి వర ప్రసాదిని
అనదగ్గ పోలవరం పనుల్ని పక్క దారి పట్టించేందుకు చంద్రబాబు పట్టి సీమ ఎత్తిపోతల
పథకాన్ని తెర మీదకు తెచ్చారు. దీన్ని అమలు చేసేందుకు ప్రత్యేకంగా జీవో తెచ్చారు.
టెండర్లకు కావాల్సిన నిబంధనల్ని అడ్డంగా మార్చేసి, తమకు కావాల్సిన సంస్థకే
టెండర్లు దక్కేలా చర్యలు తీసుకొన్నారు. తర్వాత తాపీగా ఆ సంస్థ కు 21 శాతం అదనంగా
నిధులు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నారు. వాస్తవానికి అంచనా వ్యయం కన్నా ఐదు శాతం
మించిన టెండర్లను అనుమతించకూడదు. అయినా సరే, చంద్రబాబు మాయోపాయంతో ఈ ఒప్పందం
కుదుర్చుకొంది. ఏడాదిలోగానే పథకం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, దానికే 16 శాతం
బోనస్ చెల్లిస్తామని ప్రకటించారు.

అసలు కథ అప్పటి నుంచి

మార్చి 29, 2015న పనులు మొదలు పెట్టారు. కానీ, నాసిరకంగా ముందుకు సాగించేందుకు
రక రకాల చర్యలు చేపట్టారు. పట్టిసీమ అయిపోయిందనిపించేందుకు రక రకాల మార్గాల్ని
అన్వేషించారు. ఆగస్టు 15 నాటికి కొలిక్కి తెచ్చేస్తామని ఘనంగా ప్రకటించారు. తీరా
చూస్తే ఆ సమయానికి ఏ రకంగానూ ముందుకు అడుగు పడలేదు. దీంతో ఆగస్టు 15 రోజున పనులు
ఏమాత్రం కాకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించేశారు. రాయల సీమ నుంచి
అరువు తెచ్చిన పంపుతో నామ్ కే వాస్తీగా అయిందనిపించారు.

రెండు చెంబులతో అనుసంధానం

ట్రయల్ రన్ కింద పట్టి సీమ నుంచి నీళ్లు పారించాం అని చంద్రబాబు గొప్పలు
చెప్పారు. తీరాచూస్తే నీళ్లు రానే లేదు. గోదావరి నుంచి క్రిష్ణా నదికి నదుల
అనుసంధానం చేస్తున్నట్లు, దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానం ఘనత
తమదే అని గొప్పలు చెప్పారు. తీరా చూస్తే నీళ్లు రానే రాలేదు. దీంతో రెండు చెంబుల
నీళ్లు పోసి అనుసంధానం అయిపోయిందని తేల్చేశారు.

ఇప్పుడు అదే బాటలో ప్రారంభోత్సవం

29వ తేదీ వస్తే ఏడాది పూర్తయిపోతుంది కాబట్టి కాంట్రాక్టర్ కు మేలు
కల్పించేందుకు చంద్రబాబు తనదైన వ్యూహాన్న అమలు చేశారు. పనులు పూర్తి కాకపోయినా
ప్రారంభోత్సవం  చేసేయాలని
నిర్ణయించుకొన్నారు. నీళ్లు ప్రవహించినా, ప్రవహించకపోయినా ప్రారంభోత్సవం చేశారు.
దీంతో కాంట్రాక్టర్ కుఅ దనపు చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధం అయింది. 


Back to Top