పొగాకు రైతు జీవితం క‌ష్టాల మ‌యం

ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ప‌శ్చిమ‌గోదావ‌రి ఏజ‌న్సీకి వ‌స్తున్నారు. అక్క‌డి పొగాకు రైతుల‌కు సంఘీభావంగా నిల‌వ‌నున్నారు. దీంతో మ‌రోసారి రైతుల క‌ష్టాల మీద‌కు అంద‌రి దృష్టి మళ్లింది. 
తెలుగునాట పొగాకురైతుల జీవితం క‌ష్టాల మ‌యంగా నిలిచింది. చంద్ర‌బాబు నాయుడు ప‌రిపాల‌న‌లో ఆహార పంట‌లు పండించే రైతుల‌తో పాటు వాణిజ్య పంట‌లు పండించే రైతులు క‌ష్టాల క‌డ‌లిలో మునిగిపోతున్నారు. 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌ధానంగా ప్ర‌కాశం, నెల్లూరు, గుంటూరు, ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాల్లో అధికంగా పొగాకును పండిస్తున్నారు. ఈ ఏడాది చూసుకొంటే 33, 163 హెక్టార్ల‌లో పంట సాగు అయింది. మొత్తంగా చూసుకొంటే 44, 958 మంది పొగాకు పండించేందుకు రిజిస్ట‌ర్ చేయించుకొన్నారు. ఇన్ని వేల మంది ప్ర‌భుత్వం నుంచి మ‌ద్ద‌తు లేక ఉస్సూరుమంటున్నారు. 

ఇవీ పొగాకు రైతుల స‌మ‌స్య‌లు.
1. సెస్సుల వ‌సూళ్లు.. పొగాకు కొనుగోళ్ల మీద రైతు నుంచి 1.25 శాతం సెస్ వ‌సూళ్లు చేస్తున్నారు. అనుమ‌తికి మించి పండించితే సెస్ 5 నుంచి 10 శాతం వ‌సూలు చేస్తారు. ఇది రైతు ఆదాయానికి గండి కొట్టే చ‌ర్య‌.
2. గిట్టుబాటు ధ‌ర ప్ర‌ధాన స‌మ‌స్య‌. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చే నాటికి ధ‌ర రూ. 175 ఉండ‌గా, ఇప్పుడు అది 105 కు ప‌డిపోయింది. ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్సీపీ, ఇత‌ర ప్ర‌జా సంఘాలు నిరంత‌రాయంగా ధ‌ర్నాలు చేయ‌టంతో రూ. 120కు చేరి నిలిచిపోయింది. ఇది గిట్టుబాటు కావ‌టం లేద‌న్న‌ది రైతుల అభిప్రాయం.
3. ఆంక్ష‌లు.. గ‌తంలో ఒక బ్యార‌న్ నుంచి 45 క్వింటాళ్ల దాకా పొగాకు అమ్ముకొనే వీలుండేది. కానీ దాన్ని 25 క్వింటాళ్ల‌కు ప‌రిమితం చేశారు. దీంతో రైతు అదునులో కూడా అధికంగా అమ్ముకోలేని పరిస్థితి.
4. రుణ‌మాఫీ మాయ.. అంద‌రు రైతుల్లాగే పొగాకు రైతులు కూడా చంద్ర‌బాబుని న‌మ్మి బాగా మోస‌పోయారు. ఒక్క‌సారిగా రుణ‌మాఫీ చేస్తాన‌ని చెప్పేస‌రికి అప్పు తీర్చ‌టం మానేశారు. దీంతో బ్యాంకుల్లో డిఫాల్ట‌ర్లుగా మారిపోయారు. ఫ‌లితంగా అప్పులు ఇచ్చే ప‌రిస్థితి లేకుండా పోయింది.

5. బ్యారెన్ల కొనుగోలు.. గ‌తంలో బ్యారెన్ల కొనుగోలుకు బ్యాంకులు అప్పులు ఇచ్చేవి. కానీ రుణ‌మాఫీ మాయ‌తో అప్పులు పుట్ట‌డం లేదు. దీంతో బ్యారెన్ల‌ను కొన లేక‌, పొగాకు అమ్ముకోలేక అష్ట క‌ష్టాలు ప‌డుతున్నారు.  
6. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ లోపం.. వాస్త‌వానికి పొగాకు ప‌రిమిత పంట కావ‌టంతో ధ‌ర‌ను స్తిరీక‌రించ‌టం తేలిక‌. సీజ‌న్ లో త‌గ్గుతుంటే బోర్డు నుంచి కొనిపించి, తర్వాత రైతును ఆదుకొనే వీలుంది. కానీ ప్ర‌భుత్వాలు ఈ దిశ‌గా ఆలోచించ‌క‌పోవ‌టంతో రైతు న‌ష్ట పోతున్నాడు.
7. బాబు ప్ర‌భుత్వం దొంగాట‌.. రైతాంగం సంక్షోభంలో ఉన్న‌ప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం పొగాకు ను కొనుగోలు చేయ‌వ‌చ్చును. గ‌తంలో కొన్ని ప్ర‌భుత్వాలు కొనుగోలు చేశాయి. దివంగ‌త మ‌హానేత వైయ‌స్సార్ హ‌యంలో రెండుసార్లు కొనుగోలు చేసిన దాఖ‌లాలు  ఉన్నాయి.  కానీ, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాత్రం ప‌ట్టించుకోకుండా గాలికి వ‌దిలేసింది.
8. వేలం నిలిపివేత‌.. పొగాకు వేలం జ‌న‌వరిలో మొద‌లెట్టి జూన్ లో నిలిపివేస్తే రైతుల‌కు లాభం. కానీ అక్టోబ‌ర్ దాకా సాగ‌దీ్తుంటే న‌ష్ట‌పోతున్నారు.


ఇటువంటి స‌మ‌స్య‌ల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవాల‌న్న డిమాండ్ తో రైతుల ప‌క్షాన పోరాడేందుకు ప్ర‌తిప‌క్ష నేత‌, వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ జంగారెడ్డి గూడెంలో రైతుల‌తోస‌మావేశం అవుతున్నారు. 
Back to Top