మ‌హానాడుతో తిరుమ‌ల భ‌క్తుల‌కు తిప్ప‌లు

() తెలుగుదేశం నాయ‌కుల‌తో భ‌క్తుల‌కు క‌ష్టాలు
() తిరుమ‌ల‌లో పోటెత్తిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు
() క్యూ లైన్ల‌లో మ‌గ్గిపోతున్న సామాన్య భ‌క్త జ‌నం

తిరుమ‌ల‌) వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తుతారు. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, ఎమ్ సెట్ ఫ‌లితాలు రావ‌టంతో పెద్ద ఎత్తున‌ విద్యార్థులు, టీచ‌ర్లు, త‌ల్లిదండ్రులు తిరుమ‌ల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. ముఖ్యంగా మే మాసం చివ‌రి వారం నుంచి జూన్ మొద‌టి వారంలో తిరుమ‌ల తిరుప‌తి భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతుంది. ఈ స‌మ‌యంలో స్వామి వారి సర్వ‌ద‌ర్శ‌నానికి ర‌ద్దీ ఏర్ప‌డుతూనే ఉంటుంది. 

తిరుమ‌ల‌కు తెలుగు త‌మ్ముళ్లు, నాయ‌కులు 
కాగా తిరుప‌తిలో మూడు రోజుల నుంచి మ‌హానాడును నిర్వ‌హిస్తున్న విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో మ‌హానాడు హ‌జ‌ర‌య్యేందుకు వ‌చ్చిన తెలుగు త‌మ్ముళ్లు తిరుమ‌లేశ్వ‌రుడిని ద‌ర్శించుకుంటున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంచార్జీలు సైతం తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో సామాన్య భ‌క్తుల‌కు వ‌స‌తులు క‌రువ‌య్యాయి. మ‌హానాడుకు హాజ‌రైన అనంత‌రం శ‌నివారం ఉద‌యం హోంమంత్రి చిన్న‌రాజ‌ప్ప‌, మంత్రులు అయ్య‌న్న‌పాత్రుడు, ప‌రిటాల సునీత, పీత‌ల సుజాత‌, ఎంపీలు నాని, ముర‌ళీమోహ‌న్ త‌దిత‌రులు స్వామి వారిని ద‌ర్శించుకున్నారు

ఈ మ‌హా నాయ‌కులు, బ‌డ బాబుల కోసం టీటీడీ గేట్లు బార్లా తెరిచింది. అన్ని సౌక‌ర్యాలు, వ‌స‌తులు క‌ల్పించ‌టంలో స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తోంది. నాయ‌కుల వెంట వ‌చ్చే అనుచ‌రులు కూడా పెద్ద ఎత్తున తిరుమ‌ల కొండ మీద తిష్ట వేస్తున్నారు.  

సామాన్య భ‌క్త‌జ‌నావాళికి ద‌ర్శ‌నం క‌ష్ట‌త‌ర‌మే
శ‌ని, ఆదివారాల్లో పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తున్న సామాన్య భ‌క్తుల‌కు టీటీడీ అధికారులు చుక్క‌లు చూపిస్తున్నారు.  భక్తులను మాడ వీధుల్లోని గ్యాలరీల్లో కూర్చోబెట్టారు. గంట‌ల త‌ర‌బ‌డి క్యూ లైన్ల‌ను నిలిపి వేస్తున్నారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు కావ‌ల‌సినంత సేపు ద‌ర్శ‌నం ఏర్పాటు చేస్తున్న టీటీడీ అధికారులు సామాన్యుల్ని మాత్రం కొన్ని సెక‌న్లు కూడ దేవ‌దేవుడి ద‌గ్గ‌ర ఉండ‌నీయ‌టం లేదు. గంట‌ల కొద్దీ క్యూ లైన్ల‌లో వేచి ఉన్న భ‌క్తుల‌కు క్ష‌ణ‌మాత్రం ద‌ర్శ‌నంతోనే స‌రిపెట్టుకోవాల్సిన ప‌రిస్థితి. 
Back to Top