ముఖ్యమంత్రి పర్యటనా..మజాకానా..!

గుంటూరు: వేసవిలో ఎండలు దంచేస్తున్నాయంటే మొక్కలు, చెట్లు తగ్గిపోవటమే అని
అంతా చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు మొక్కలు, చెట్లు పెంచాలని ప్రభుత్వ వర్గాలు
భావించాలి కానీ ముఖ్యమంత్రి పర్యటన కోసం గుంటూరు జిల్లా అధికారులు మాత్రం చెట్లు
నరికేస్తున్నారు. ఒకటి, రెండు కాదు ఏకంగా 200 భారీ వృక్షాలు బ‌లి చేస్తున్నారు.

గుంటూరు న‌గ‌రం గుజ్జ‌న‌గుండ్ల నుంచి కొరిటెపాడు వ‌ర‌కు దాదాపు మూడు కిలోమీట‌ర్ల మేర రో్డ్డు విస్తరణ సాకుతో చెట్లు తొలగిస్తున్నారు. రోడ్డు పొడ‌వునా ఇరువైపులా 200 భారీ వృక్షాలు ఉండ‌గా... గుజ్జ‌న‌గుండ్ల
వైపు నుంచి చెట్ల న‌రికివేత ప్రారంభించిన అధికారులు రోడ్డుకు దూరంగా ఫుట్‌పాత్ వ‌ద్ద
ఉన్న చెట్ల‌ను పొక్ల‌యిన‌ర్ సాయంతో వేళ్ళ‌తో స‌హా పెకిలించి వేశారు. స్థానికులు
అభ్యంత‌రం చెప్పినా... సీఎం గుంటూరు వ‌స్తున్నార‌ని, ఆయ‌న వ‌చ్చే లోపు ర‌హ‌దారి విస్త‌ర‌ణ ప‌నులు
పూర్తి చేయాల్సి ఉందంటూ న‌రికివేత కొన‌సాగించారు. ఒక్క‌రోజే ప‌దుల సంఖ్య‌లో చెట్లు
న‌రికివేశారు. మిగిలిన చెట్ల‌ను మ‌రో రెండు రోజుల్లో పూర్తిచేసే అవ‌కాశం ఉంది. 1999లో ఇదే విధంగా చంద్రబాబు ఆలోచనల కోసం భారీ
వృక్షాల‌ను న‌రికివేశారు. మ‌ళ్లీ రోడ్డుకు ఇరువైపులా పెరిగిన మొక్క‌లు ప్ర‌స్తుతం
భారీ వృక్షాల‌య్యాయి. తాజాగా వీటిని కూడా న‌రికివేస్తుండ‌టంతో గుంటూరుకు గ్రీన్
గుంటూరుగా పేరు తెచ్చిన రింగ్‌రోడ్డు ఎడారిని త‌ల‌పించ‌నుంది. ఇదీ చంద్రబాబు
పరిపాలన తీరు..!

 

Back to Top