వై ఎస్ జ‌గ‌న్ టాప్ టెన్ కామెంట్స్

హైద‌రాబాద్‌) అసెంబ్లీ లో విద్యుత్ శాఖ మీద జ‌రుగుతున్న ప‌ద్దుల మీద చ‌ర్చ‌లో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాల్గొని.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వ బండారాన్ని బ‌ట్ట బ‌య‌లు చేశారు. అడ్డ‌గోలుగా జ‌రుగుతున్న దోపిడీని లెక్క‌ల‌తో స‌హా ప్ర‌జ‌ల ముందుకు తెచ్చారు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌సంగంలోని టాప్ టెన్ కామెంట్స్ ఇప్పుడు చూద్దాం.
1. 16వేల మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ ను కొనుగోలు చేయాల‌ని విద్యుత్ రంగ పంపిణీ సంస్థ‌లు ప్ర‌తిపాదించాయి. దీని మీద లెక్క‌లు క‌ట్టిన విద్యుత్ నియంత్ర‌ణ మండ‌లి కేవ‌లం 757 మిలియ‌న్ యూనిట్లు కొంటే స‌రిపోతుంద‌ని తేల్చి చెప్పింది. అయినా స‌రే, 15, 251 మిలియ‌న్ యూనిట్లు కొనుగోలు చేశారు. అంటే ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో అర్థం చేసుకోవ‌చ్చు.
2. క‌రెంటు కోత లేకుండా చేస్తున్నాం అన్న వంక‌తో అడ్డ‌గోలుగా కొనుగోళ్లు జ‌రిపారు. అధిక ధ‌ర‌కు అధిక మొత్తంలో జ‌రిగిన కొనుగోళ్లు ఇవి.
3. 2015-16 లో డిసెంబ‌ర్ నెలాఖ‌రులో రోజు మొత్తానికి రూ. 2-71 పైస‌లు మ‌రియు రాత్రి స‌మ‌యంలో 1రూ. 90పైస‌ల‌కు క‌రెంట్ అందుబాటులో ఉంది. అయిన‌ప్ప‌టికీ 5 రూ.11పైస‌ల‌కు కొనుగోలు చేశారు.
4. అవ‌స‌రం లేక‌పోయినా స‌రే 2016-17  లో 64వేల 706 మిలియ‌న్ యూనిట్ల కొనుగోలుకు ప్రణాళిక‌లు సిద్ధం చేశారు. 
5. విద్యుత్ పంపిణీ సంస్థ‌ల విచ్చ‌ల‌విడి కొనుగోళ్ల గురించి ఇండియ‌న్ ఎన‌ర్జీ ఎక్స్చేంజ్ నివేదిక రూపంలో అక్షింత‌లు వేసింది.
6. చౌక‌గా విద్యుత్ దొర‌కుతున్న‌ప్ప‌టికీ రూ. 26,378 కోట్ల మేర కొనుగోళ్లు జ‌రిపారు అని ఐ ఈ ఈ కామెంట్ల రూపంలో చెప్ప‌టం జ‌రిగింది.
7. బొగ్గు కొనుగోలు ఒప్పందంలో మ‌రింత మాయాజాలం క‌నిపిస్తోంది.
8. 69.15 డాల‌ర్ల రేటు ఉన్న‌ప్ప‌డు ఒప్పందం చేసుకొన్నారు. ఇప్పుడు 52.4 డాలర్ల‌కు రేటు ప‌డిపోయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మాత్రం ఇప్ప‌టికే అదే రేటుకి కొంటూ వెళుతోంది. 
9. బొగ్గు ఒప్పందం స‌మ‌యంలో 12 లక్ష‌ల ట‌న్నుల‌కు అంగీక‌రిస్తే, ఇప్పుడు 19.25 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు చేరిపోయింది.
10. ఇన్ని ర‌కాలుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మాయ‌లు చేస్తూ, సిగ్గు లేకుండా స‌మ‌ర్థించుకొంటోంది. 

తాజా వీడియోలు

Back to Top