ఆదర్శమూర్తి..పోరాట స్ఫూర్తి

 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సతీమణిగా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి తల్లిగా.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న వైయస్‌ విజయమ్మ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న వైయస్‌ విజయమ్మపై ప్రత్యేక కథనం మీకోసం..

ఏ సందర్భంలోనూ ధైర్యం కోల్పోని ఉక్కు మనిషి విజయమ్మ
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోవడం..  కుట్ర రాజకీయాల కారణంగా కాంగ్రెస్‌పార్టీ  నుంచి బయటకు రావడం.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ స్థాపించడం వంటి విషయాలు రాష్ట్ర ప్రజలకు విదితమే. అయితే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాటికి పార్టీలో వైయస్‌ విజయమ్మ, తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. తదనంతరం జరిగిన పరిణామాలు.. కుట్ర రాజకీయాల కారణంగా, అన్యాయంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని జైలుకు పంపించడం, పార్టీ బాధ్యతలను విజయమ్మ భుజాన వేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో వైయస్‌ విజయమ్మ పార్టీని ఎంత సమర్థవంతంగా నడిపించారో ప్రపంచం మొత్తం చూసింది. 
అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. మహానేత వైయస్‌ఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారంటూ అసెంబ్లీ సాక్షిగా గళం విప్పారు. ఎన్నో పోరాటాలు చేశారు. దీక్షలు చేశారు. ధర్నాలు  చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరిన ఎమ్మెల్యేల తరపున ప్రచారం చేసి గెలిపించుకున్న తీరును శత్రువులు సైతం ప్రశంసించారంటే విజయమ్మ పార్టీ కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. 

నాటి నుంచి నేటి వరకు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు చేసిన ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలపడం వరకు ఇలా ఎన్నో పోరాటాలు ఆమె పాత్ర మరిచిపోలేనిది. పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటూ పార్టీకి సలహాలు ఇస్తూనే, అవసరమైనప్పుడల్లా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూనే మహానేత వైయస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి చేస్తున్నారు. కష్టమొచ్చినప్పుడు ధైర్యంగా నిలబడడం. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా ఉండడం. కష్టాల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం చేయడం వంటివన్నీ రాజన్న నుంచి నేర్చుకున్న విజయమ్మ... ఇప్పటికీ ఆ ఆదర్శాల బాటలోనే ముందుకు నడుస్తున్నారు.ప్రజా సేవలో ముందుంటానంటూ నడుస్తున్న వైయస్ జగన్   ఆదర్శానికి  ఆశీర్వాదమవుతున్నారు.
Back to Top