పార్లమెంటులో మూడు స్తంభాలాట

న్యూఢిల్లీ))
పార్లమెంటు వేదికగా తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ సాగించిన మూడు స్తంభాలాట బయట
పడింది. ప్రత్యేక హోదా అంశం మీద ప్రైవేటు బిల్లు ఓటింగ్ కు రాకుండా శాయశక్తులా
పనిచేసి తమ బుద్ధి బయట పెట్టుకొన్నాయి.

        ప్రత్యేక హోదా అంశం మీద కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు
బిల్లు తెచ్చేందుకు ఆర్భాటంగా ప్రకటన చేసింది. ఇతర పార్టీలన్నీ కలిసి రావాలని
పిలుపు ఇచ్చింది. మొదట నుంచీ ప్రత్యేక హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న పార్టీ
వైయస్సార్సీపీ. అందుకే విభిన్న స్థాయిల్లో జరుగుతున్న ప్రయత్నాలకు అండగా నిలవాలని
నిర్ణయించింది. అందుకే ప్రైవేటు మెంబర్ బిల్లుకి మద్ధతు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం
చేసింది. అయితే రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత పరిణామాలు ఒక్కసారిగా
మారిపోయాయి.

        ఈ సబ్జెక్టుకి సంబంధం లేని అంశం మీద
బీజేపీ సభ్యులు ధర్నాకు దిగారు. అదే సమయంలో కాంగ్రెస్ సభ్యులు దీనికి వ్యతిరేకంగా
మరింత గందరగోళం పెంచే ప్రయత్నం చేశారు. మొదట నుంచీ అవకాశ వాద ధోరణి
ప్రదర్శిస్తున్న తెలుగుదేశం మరోసారి అదే ప్రయత్నం చేసింది. వాస్తవానికి ఈ బిల్లు
ప్రవేశ పెట్టకుండా తెరచాటు ప్రయత్నాలు టీడీపీ ముమ్మరంగా చేసిందన్న మాట ఉంది. ఆ
సంగతి పక్కన పెడితే ఓటింగ్ కు వస్తే స్పష్టంగా మద్దతిస్తామని కూడా చెప్పకుండా
నాటకాలు కొనసాగించింది. సభలోనూ, సభ బయట కూడా టీడీపీ ఎంపీలు మొసలి కన్నీరు కార్చి
డ్రామాను రక్తి కట్టించారు.

        పార్లమెంటు సమావేశాల తర్వాత మీడియాతో
మాట్లాడిన వైయస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. మూడు పార్టీల తీరు మీద
మండిపడ్డారు. చిత్తశుద్ధి లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదా మీద తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

 

తాజా ఫోటోలు

Back to Top