నాడూ నేడూ ప్రజా పక్షమే

నాయకుడంటే
అంటే ఇలా ఉండాలి అని అనిపించారు వైయస్ఆర్.
లీడర్ అంటే ఇతడే అనిపించుకుంటున్నాడు వైయస్ జగన్
. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాడిన తీరే ఈ ఇద్దరినీ ప్రజలకు
దగ్గర చేసింది. నాడు వైయస్ఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఎలాంటి ఉన్నతమైన
పాత్ర పోషించారో, అదే విధంగా వైయస్ జగన్ నేడు క్రియాశీల పాత్ర
పోషిస్తున్నారు.

పాదయాత్ర

2003లో చంద్రబాబుపాలనలో కరువు కాటకాలతో, రైతుల ఆత్మహత్యలతో,
విద్యుత్ ఛార్జీల భారంతో, ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న
ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కలిసి, వారికి ధైర్యాన్నిచ్చేందుకు
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రను ఆరంభించారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం దాకా పాదయాత్రగా ప్రయాణించి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.
మండే ఎండలు, ఆనారోగ్యం వేటినీ లెక్కచేయలేదు.
పాదయాత్రలో ఆయన కళ్లారా చూసిన ప్రతి సమస్యనూ అధికారంలోకి వచ్చాక పరిష్కరించారు
వైయస్ఆర్. నేడు ఆయన కొడుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అదే
చంద్రబాబు అవినీతి, అంధకార ప్రభుత్వతీరుకు వ్యతిరేకంగా ప్రజా
సంకల్పం చేపట్టారు.

బాబును
విమర్శించడంలో

చంద్రబాబును
విమర్శించడంలో వైయస్ ఆర్,
ఆయన తనయుడు వైయస్  జగన్ ఇద్దరూ
వ్యంగ్యాత్మక విధానాన్ని ఎంచుకోవడం విశేషం. బాబుది భస్మాసుర హస్తం
అని వైయస్ఆర్ తరచు అనేవారు. అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు
బంగారు గాజులు చేయిస్తానన్నాడట అంటూ సామెతలతో బాబును విమర్శించే తీరు ప్రజలను ఆకట్టుకునేది.
నేడు వైయస్ జగన్ చంద్రబాబుపై విమర్శలు చేస్తూ నీతిలేని కొంగ చంద్రబాబు
దొంగ అన్నప్పుడు కూడా ప్రజలు మద్దతిస్తూ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. వెన్నుపోటు గురించి చంద్రబాబు ఉండగా మాట్లాడటం అనవసరం అంటూ వైయస్ఆర్ ఛలోక్తులు
విసిరితే, పిట్టల దొర లా జనాలకు బురిడీ కొడుతున్నారంటూ వైయస్
జగన్ విమర్శించారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో మరో అడుగు ముందుకేసి
బాబు తీరును పిట్టకథల్లా చెబుతున్నారు జగన్ మోహన్ రెడ్డి.

అసెంబ్లీలో

ప్రతిపక్ష
నేత హోదాలో ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అక్రమాలు, నిర్లక్ష్యాలపై  వైఎయస్ ఎలా చెలరేగిపోయేవారో, వైఎస్ జగన్ కూడా అదే మాదిరి
శాసన సభలో ప్రభుత్వ అన్యాయాలపైనా విరుచుకుపడుతుంటారు. అధికారపార్టీ
జులుంపై వైయస్ఆర్ ఆవేశంతో ప్రశ్నించిన విధంగానే జగన్ సైతం టిడిపి అధినేత అవినీతిపై
గళం విప్పుతుంటారు. నాడు సూట్ కేసు బాంబు విషయంలో తన కుమారుడిపై
 ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు వేయించుకోమని
సవాల్ చేసారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబును
ప్రతిపక్ష నాయకుడి హోదాలో వైఎస్ కడిగేసిన తీరు ఓ సెన్సేషన్. ఇక
వైయస్ జగన్ సైతం కాల్ మనీ, పట్టిసీమ, ప్రత్యేక
హోదా అంశాల్లో చంద్రబాబుతో విబేధించిన తీరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
ప్రజల కోసం ప్రజా ప్రతినిధులు అన్న మాటకు న్యాయం చేసిన నేతలుగా అసెంబ్లీ
చరిత్రలో వైయస్ఆర్, వైయస్ జగన్ నిలిచిపోతారని అంటారు రాజకీయ విశ్లేషకులు.

ప్రజల
సంక్షేమం గురించి ఆలోచించడంలో

ప్రజల
గురించి ఆలోచించడంలో తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు వైయస్  జగన్.
వైయస్ఆర్ ప్రజా సంక్షేమ పథకాలన్నిటికీ పూర్వ వైభవం తెస్తానని మాటిస్తున్నారు.
వైయస్ఆర్  పాలనకంటే మెరుగ్గా
పరిపాలించేందుకు కృషి చేస్తానని నమ్మకంగా చెబుతున్నారు. రైతులు,
మహిళలు, కూలీలు, నిరుద్యోగులు,
విద్యార్థులు, చేతి వృత్తుల వారు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఇలా ప్రతి ఒక్కరికీ అనువైన
నవరత్నాల్లాంటి పథకాలను వైయస్ జగన్ ప్రకటించారు. ప్రతి మనిషి
ముఖంలోనూ చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని, తండ్రి ఫొటో లాగే
తన ఫొటోను కూడా తెలుగు ప్రజలు తమ ఇంట్లో పెట్టుకునేలాంటి పాలనను అందిస్తానని హామీ ఇస్తున్నారు.

 

 

Back to Top