తెలుగు జాతి..నిండు ఖ్యాతికి అంజలిదిగో..


 
- కృష్ణా జిల్లాకు ఎన్‌టీఆర్‌ పేరు 
– నిమ్మకూరులో ప్రకటించిన వైయస్‌ జగన్‌
- వైయస్‌ జగన్‌ నిర్ణయంపై హర్షాతిరేకాలు
– అన్నగారికి అపూర్వ గౌరవం
విజయవాడ:  మూడుదశాబ్దాలకు పైగా, వెండితెరపై  వెలుగుల ’హీరో’ గా   ఆయనది ఓ చరిత్ర. అది సువర్ణాక్షరాలతో..కాలమే రాసిపెట్టిన చరిత్ర. రాష్ట్రరాజకీయాలలో అనితరసాధ్యమైన విజయాల చరిత్రా ఆయనదే. ఎన్టీయార్‌ అంటే  ఒక తెలుగువాడి. ఒక తెలుగునాడి. ఆ వాడి, ఆ నాడి అయినవాళ్లకే పట్టలేదు. స్వంతఅల్లుడే వెన్నుపోటుతో ఓ మహాచరిత్ర ముగింపును విషాదంగా మార్చేశాడు. చరమాంకంలో ఓ మహాజ్యోతి కొడిగట్టేలా చేశాడు.
తెలుగుదనానికి, తెలుగువాడి ఆత్మవిశ్వాసానికి, ఆత్మగౌరవానికి పట్టం కట్టిన మహామనిషి పేరిట కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరుపెడతానన్నాడు వైయస్‌జగన్‌. ఎన్టీఆర్‌ జన్మించిన నిమ్మకూరు సాక్షిగా..నిమ్మకూరు ప్రజల మధ్యన ఆయన ఆ పేరు ప్రకటించారు. నిజంగా తెలుగుజాతి సగర్వంగా స్వాగతించాల్సిన విషయమిది.
వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా అనితరసాధ్యుడై వెలిగిన ఎన్టీయార్‌ భారతదేశం గర్వించదగ్గనటుడిగా అజరామరకీర్తిని స్వంతం చేసుకున్నారు. వేలులక్షలుగా వున్న తన ’మాస్‌’ అభిమానుల అభిమానధనాన్ని మూటకట్టుకుని ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించారు. తెలుగుదనం పులకించింది. లె లుగుమాట ఎలుగెత్తింది. ’తెలుగుదేలయన్న...దేశంబు తెలుగేను అంటూ  తెలుగుపద్యం...తెలుగుజాతి మనది, నిండుగ వెలుగుజాతి మనది’  అంటూ తెలుగుపాట జైకొట్టింది.  
 మహాకవి శ్రీశ్రీ జయంతి రోజున  వైయస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ ..కృష్ణాను ఎన్టీయార్‌ జిల్లాగా పేరుపెడతామని ప్రకటించారు. రాగద్వేషాలకు, రాజకీయాలకు అతీతంగా చెప్పిన మాట...ఓ మహామనిషికి..ఓ మంచిమనిషి ఘననివాళి.
సినిమాల్లో ఆణిముత్యం, రాజకీయాల్లో జాతిముత్యంలా భాసించిన ఎన్టీయార్‌ పేరును సంకుచితరాజకీయాలకు ఆమడదూరం పెట్టిన సంస్కారానికి ప్రతి తెలుగు గుండె స్పందనా అంగీకార సూచకమే అవుతుంది. ...
 
Back to Top