తెలుగు దేశం పార్టీ తెగులు ఇలా ఉంది


టిడిపి నేత‌ల‌కు అధికారులు, ఉద్యోగులు, ప్రజ‌లు అనే తేడా లేదు. ఎవ్వ‌రినైనా స‌రే నోటికొచ్చిన‌ట్టు తిట్ట‌డం. బూతులు తిట్ట‌డం. చేయి చేసుకోవ‌డం. ఇదీ బాధ్య‌త గ‌ల ప్రజాప్రతినిధుల‌ తీరు. ఇందులో కృష్ణాజిల్లా నాయ‌కుల‌కైతే పి.హెచ్.డి ప‌ట్టానే ఉంది. బోండా ఉమా నుంచి మొద‌లెట్టి కొల్లు ర‌వీంద్ర వ‌ర‌కూ అంద‌రూ అప‌ర బూతు పురాణ దురంధ‌రులే. వీళ్ల‌కు పబ్లిక్ లో ఉన్నామా అసెంబ్లీలో ఉన్నామా అన్న తేడా ఉండ‌దు. అధికార మ‌దం తల‌కెక్కించుకుని, అంద‌ర్నీ అహంకారంతో అదిలించ‌డ‌మే గొప్ప‌త‌నం అనుకుంటున్నారు. తాజాగా మ‌చిలీప‌ట్నంలో జ‌రిగిన ఉదంతం క‌ల‌వ‌రం రేపుతోంది. మంత్రి కొల్లు ర‌వీంద్ర మున్సిప‌ల్ ఉద్యోగిని చెప్ప‌లేని మాట‌ల‌తో తిట్ట‌డాన్ని చూసి ప్రజ‌లంతా నివ్వెర‌పోయారు. మంత్రి ఇంత దిగ‌జారి మాట్లాడ‌తాడా అంటూ అధికారులు ఆశ్చ‌ర్య‌పోయారు. మంత్రి చేత అంత‌లేసి మాట‌లు అనిపించుకున్న ఉద్యోగి చేసిన నేరం జ‌న్మ‌భూమి క‌మిటీలు చెప్పిన‌ట్ట‌ల్లా విన‌క‌పోవ‌డం. జ‌న్మ‌భూమి క‌మిటీ మెంబ‌రొక‌రు చెప్పిన మాట విని మంత్రి కొల్లు ర‌వీంద్ర మున్సిప‌ల్ ఉద్యోగిని నోటికొచ్చిన‌ట్టు తిట్టాడు. అదీ కూడా ప్రజ‌లు, అధికారుల ముందే. గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్రమంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. చెప్పిన‌ట్లు పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని, చెప్పిన‌వారికి ఇవ్వ‌డం లేద‌నే అక్క‌సుతో మున్సిప‌ల్ ఉద్యోగికి వార్నింగ్ ఇప్పించారు జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులు. నిజానికి ఆ ఉద్యోగి విక‌లాంగులు, వృద్ధుల‌కు సకాలంలో పింఛ‌న్లు అందిస్తున్నాడ‌ని, ఎక్కువ స‌మ‌యం కేటాయించి మ‌రీ వారికి ఇబ్బంది లేకుండా పింఛ‌న్లు అందిస్తున్నాడ‌ని పై అధికారులు కొద్ది రోజుల క్రిత‌మే అత‌డిని స్వ‌యంగా క‌లిసి మ‌రీ పొగిడారు. కానీ మంత్రికి, జ‌న్మ‌భూమి క‌మిటీ నాయ‌కుల‌కు త‌మ‌కు అనుకూలంగా ప‌ని చేయ‌డంలేద‌నే అక్క‌సుతో ఆ ఉద్యోగిని దారుణంగా అవ‌మానించారు. మంత్రి కొల్లు ర‌వీంద్ర ప్రవ‌ర్త‌న అస‌హ్య‌క‌రంగా, బజారు రౌడీ కంటే హీనంగా ఉంద‌ని ఎప్ప‌టి నుంచో ఆ ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. ఈ సంఘ‌ట‌న ఆ విష‌యాన్ని మ‌రోసారి రుజువు చేస్తోంది అంటున్నారు ఆ ప్రాంత వాసులు. దీనిపై ప్రతిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స్పందిచారు. మంత్రి ప్రవ‌ర్త‌న హుందాగా ఉండాలి కానీ ఇంత చౌక‌బారుగా ఉండ‌కూడ‌ద‌న్నారు. జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులు చెప్పిన‌ట్టే  చేయాల‌ని ఉద్యోగుల‌పై ఒత్తిడి చేయ‌డం, వారిని అవ‌మానించి, తిట్ట‌డం టిడిపి నేత‌ల‌కు నిత్య‌కృత్యం అయ్యింద‌ని మండిప‌డ్డారు. 
చూడ‌బోతే తెలుగుదేశం పార్టీ నాయ‌కుల‌కు కుల వివ‌క్ష జ‌బ్బే కాదు, విచ‌క్ష‌ణ లేక‌పోవ‌డం అనే లోపం కూడా ఉంద‌ని అర్థం అవుతోంది. టిడిపి అంటే తెగులుదేశం పార్టీ అని ఆమ‌ధ్య ఆ పార్టీ నేత‌లే క‌ట్టించుకున్న బాన‌ర్ అక్ష‌ర స‌త్యం అని ప్రజ‌లకు న‌మ్మ‌కం క‌లిగింది. 
Back to Top