తెలివి తెచ్చుకో బాబూ..

 

కేరళ వరదలను చూసి చంద్రబాబు ఏమన్నా బుద్ధి తెచ్చుకోనున్నారా లేదా అని ప్రశ్నించాల్సిన
సమయం వచ్చింది. అమరావతి, ప్రపంచ స్థాయి రాజధాని
అంటూ చెప్పుకొచ్చే బాబు ముంపు ప్రాంతాల్లో రాజధానులు కట్టినా, భారీ నిర్మాణాలు చేపట్టినా
జరిగే ఉపద్రవాలు ఎంత దారుణంగా ఉంటాయో కేరళ సంఘటనలు చూసాకైనా అర్థం చేసుకుంటే బాగుండు
అంటున్నారు పర్యావరణ వేత్తలు.

నదీతీర నగరాల దుస్థితి

వేలాది ఎకరాలను రాజధాని కోసం సమీకరించారు. ఆధ్రప్రదేశ్ రాజధానిని కృష్ణా నదీ తీరంలో ఉండాలని
నిర్ణయించేసారు. ఇష్టానుసారంగా నిర్మాణాలకు
తలలూపేస్తున్నారు. కానీ నదీ తీర ప్రాంతంలో, ముంపుకు అవకాశమున్న చోట్ల రాజధాని నిర్మించడం ఎంతో ప్రమాదకరం అని ఎన్నో సంఘటనలు
రుజువు చేస్తున్నాయి. మహారాష్ట్రా రాజధాన ముంబై, తమిళనాడు రాజధాని చెన్నై, నేడు కేరళ...వరదలు ముంచెత్తినప్పుడు
మహానగరాలు చిగురుటాకులల్లే వణికిపోతున్నాయి. నిర్మాణాలు నేలమట్టం అవుతున్నాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం అంచనాకు
అందడం లేదు. నదుల ప్రవాహాలకు అడ్డుపడే
నిర్మాణాలు తొలగించాలని రాజేంద్ర సింగ్ వంటి పర్యావరణవేత్తలు నెత్తీ నోరూ బాదుకుని
చెబుతున్నారు. ముఖ్యమంత్రివై ఉండి
నదిని ఆక్రమించి, కరకట్టలో కాపురం పెట్టావని
చంద్రబాబును మందలించారు ఈ వాటర్ మాన్. కృష్ణా నదీ తీరాన్ని ఆక్రమణలకు గురి కానీయవద్దని, భవిష్యత్ లో ఇది ఎన్నో
ప్రమాదాలకు హేతువని హెచ్చరించారు. అలా చెప్పినందుకు చంద్రబాబు ఉసిగొల్పిన రౌడీ మూకలు ఆయన వాహనాన్ని ఆపి, అల్లరి చేసాయి.

ప్రకృతి వనరుల దోపిడీ

ఎన్నాళ్లుగానో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీ
గురించి, నదీ తీరాల్లో సాగుతున్న
ఇసుక, మట్టి దోపిడి గురించీ
ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మట్టిని పిండి సొమ్ము చేసుకోవడంలో తప్ప పర్యావరణంలో
మార్పులను గుర్తించే పనిలో లేదు. నదుల్లోకి చొచ్చుకు వస్తున్న అక్రమ నిర్మాణాలు, ఇసుక దొంగతనాలు, అడవుల నరికివేత, సహజవాయువులు, నిక్షేపాలకోసం అనుమతిని
మించి తవ్వకాలు లాంటివి రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు కూడా ముంపు కష్టాలని
తీసుకువస్తాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటారా?

కొండవీటి వాగు భవిష్యత్ లో ఎప్పుడైనా పొంగి ప్రవహిస్తే కేరళలో ఇప్పుడు జరుగుతున్న
భీభత్సాన్ని, విధ్వంసాన్ని నవ రాజధానిలో
చవి చూస్తామని పెద్దలు చెబుతున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో దీనిగురించి ప్రస్తావిస్తే
రాజధానిని పదడుగుల ఎత్తు లేపుతామని చంద్రబాబు ప్రభుత్వం వాదించింది. అమరావతిలోసీడ్ యాక్సెస్ రోడ్
కూడా నిజానికి ముంపు ప్రాంతమే.  ఆర్భాటాలకు పోయి నదీతీరంలో మహానగరం
అంటూ గ్రాఫిక్స్ తో మాయాజాలం చేస్తున్న చంద్రబాబు మహామహా నగరాలే వరదల ధాటికి వణికిపోతున్నాయని
గుర్తించడం లేదు. ప్రజలను మభ్య పెట్టి, రంగుల కలలు చూపెట్టి
భవిష్యత్ పరిణామాలను దాచిపెట్టి అమరావతికి బ్రాండింగ్ చేస్తున్నాడు.  

Back to Top