టెక్కులు పోయిన లోకేష్


వినేవాడుంటే చెప్పేవాడు చంద్రబాబు అనే సామెతకు కూడా వారసత్వం అంటింది. బిల్ గేట్స్ ముందు నేనే కంప్యూటర్ పితామహుడిని అని చెప్పుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు ఆయన వారసుడి వంతు వచ్చింది. ఐటి శాఖామంత్రి నారాలోకేష్ దుబాయ్ లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆధునిక సాంకేతికత గురించి స్పీచ్ ఇస్తున్నాడు. పరిపాలనలో టెక్నాలజీ వినయోగం గురించి ఆ సదస్సులో మంత్రిగారు ప్రసంగించారు. రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటలైజేషన్, డ్రోన్స్ వాడకం, కోర్ డాష్ బోర్డ్ అంటూ ఎపిలో జరుగుతున్న సాంకేతిక పాలన గురించి దుబాయ్ ఆర్థికవేత్తల ముందు డప్పాలు కొట్టుకున్నారు. ఇదెలా ఉందంటే  ఏనుగు ముందు ఎలక పిల్ల తోక ఝాడించినట్టు ఉంది. పర్వతం ముందు పిపీలికం తొడగొట్టినట్టుంది. ఎంతో అడ్వాన్డ్స్ సాంకేతికతను అతి వేగంగా వినియోగించే దేశాల్లో దుబాయ్ కూడా ఒకటి. అలాంటి దేశంలో ఎపిలో సాగుతున్న ప్రాధమిక స్థాయి సాంకేతికతనే సూపర్ వండర్ లా పొగుడుకోవడం నారాలోకేష్ కే చెల్లింది. 
అక్కడలాఇక్కడిలా
టెక్నాలజీని వినయోగించుకోవడంలో దుబాయ్ వంటి సంపన్న దేశం ఎప్పటినుంచో ముందు ఉంది. బుర్జ్ కలీఫాలాంటి ప్రపంచ అత్యున్నత కట్టడం వారి టెక్నాలజీకి ఓ ఉదాహరణ. అమరావతిలో చిల్లుల సచివాలయం చంద్రబాబు టెక్నాలజీకి ఎగ్జాంపుల్. సముద్రంలో తేలేలా కట్టిన పామ్ ఐలండ్ వారి మరో సాంకేతిక అద్భుతం. ఐకానిక్ టవర్సు, బాహుబలి డిజైన్సు అనే భ్రమరావతి బాబుగారి కల్పితం. ఆధునిక సెన్సర్లున్న ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ లో ట్రాఫిక్ పోలీసుల అవసరం చాలా తక్కువ. రోడ్లే సరిగ్గాలేని అభివృద్ధి చంద్రబాబు పాలన. పోలీస్ వ్యవస్థ, నిఘా విభాగం, విమానాశ్రయాలు అన్నీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేవే. రాష్ట్రంలోని నిఘావ్యవస్థ, విమానాశ్రయాల భద్రత ఎంత సాంకేతికంగా ముందున్నాయో మొన్న ప్రతిపక్షనేతపై జరిగిన కత్తిదాడే తెలియజేసింది కదా. ఇక కమ్యూనికేషన్ సిస్టం , ఎడ్యుకేషన్ లోనూ ఎంతో ఫార్వార్డ్ టెక్నాలజీ వినియోగిస్తుంది దుబాయ్.  ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు రేషన్ కోసం పెట్టిన ఈపాస్ లు, గవర్నమెంట్ స్కూళ్లలో బయోమెట్రిక్ లు మూడొంతులు పనే చేయవు. ఇదీ ఎపిలో పరిపాలనను టెక్నాలజీతో అనుసంధానం చేసి సాధించిన ప్రగతి. 
ఇదేనా టెక్నాలజీ??
పోలవరం రోడ్డు పగుళ్లు, పనుల్లో నాణ్యతా లోపాలు, కట్టడాల్లో చిల్లులు, నిఘాలో లోపాలు, సాంకేతిక పరికరాలేమో నాసిరకాలు...ఇలాంటి అట్టర్ ఫెయిల్యూర్ టెక్నాలజీని నారా లోకేష్ దుబాయ్ వేదికగా పొగుడుకోవడం తెలుగువారికి తలతీసేసినట్టే ఉంటుంది.  ఇవేమీ పట్టనట్టు చినబాబు చేసిన టెక్నాలజీ ప్రసంగం రాకెట్ ముందు రంగుల రాట్నంలా ఉంది అన్నారు వివిధ దేశాల ప్రతినిధులు. స్వంత డప్పా కొట్టుకోవడం తప్ప ప్రంపంచం ఎంత ముందుకు పోతోందో చూసే తీరిక అటు బాబుగారికి గానీ, ఇటు చినబాబుగారికి గానీ లేవని వేరే చెప్పాలా ఏంటి?

 
Back to Top