అధికారం కోసం టీడీపీ అడ్డదారులు

  • ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు లిస్టులో అవకతవకలు
  • కర్నూలు జిల్లా జాబితాలో ఐదువేల మంది అనర్హులు
  • కనీస డిగ్రీ అర్హత లేకుండానే పేరు నమోదు
ఏపీలో ప్రజాస్వామ్యం కనుమరుగవుతోంది. ఇక్కడ నడుస్తున్నదంతా బాబుస్వామ్యం. ప్రజలే దేవుళ్లని.. ప్రజాస్వామ్యమే సకల సమస్యలకు పరిష్కారమని వేదికలెక్కి ప్రసంగాలిస్తారు.. అయ్యా.. నాకు అన్యాయం జరిగిందని గొంతెక్కితే ఆడవాళ్లని కూడా చూడరు. కిందపడేసి ఎగిరెగిరి కాళ్లతో తంతారు. అన్యాయం జరిగినా నోరెత్తకూడదు.. బాధ కలిగితే కన్నీరు పెట్టకూడదు.. అప్పటికీ ధైర్యం చేసి ప్రశ్నించావా.. జైలుకు వెళ్లడానికి సిద్ధపడాల్సిందే. ఇలాంటి పచ్చ పార్టీ దౌర్జన్యాలకు ఇప్పుడు చట్టాలు లేవు.. న్యాయవ్యవస్థ అడ్డుకాదు. ఎన్నికలు..ఓట్లంటే భయం లేదు. ఇప్పుడు ఏపీలో సాక్షాత్తు అలాంటి పరిస్థితే నెలకొంది. త్వరలో జరగబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో తమకు నచ్చినవారిని ఓటర్లుగా చేర్పించేసి గెలిచేయాలని పచ్చ పార్టీ పథకం రచించింది. 

కనీస డిగ్రీ అర్హత లేకున్నా ఓటర్లే..
కర్నూలు, కడప, అనంతపురం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే పెద్ద ఎత్తున అనర్హులను ఓటర్లుగా చేర్పించారు. జనవరి 12న ఎన్నికల సంఘం ప్రచురించిన 46 వేల ఓటర్లతోకూడిన జాబితాలో కేవలం ఒక్క కర్నూలు జిల్లాలోనే ఐదు వేల మంది అనర్హులు బయటపడ్డారు. అనర్హులుగా చేరిన వారందరికీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన కనీస విద్యార్హత డిగ్రీ కూడా లేకపోవడం చూస్తుంటే అధికారులతో ఇది పొరపాటుగా చేసిన చర్య కాదని తెలిసిపోతుంది. పచ్చ పార్టీ నాయకులు అధికారులను బెదిరించో.. మభ్యపెట్టో చేసినట్టుగా అర్థమవుతుంది. ఓటరుగా నమోదు అయ్యేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కనీసం డిగ్రీ సర్టిఫికెట్‌ పెట్టాలి. అలా కాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్, ఆధార్‌ కార్డు, ఉద్యోగ ఐడీ కార్డు, పాన్‌ కార్డు, మూడో సంవత్సరం డిగ్రీ సర్టిఫికెట్లతో ఓటరు జాబితాలో ఓటర్లుగా నమోదు చేశారు. ఒక వ్యక్తి ఎలాంటి సర్టిఫికెట్‌ కూడా పెట్టకుండా కేవలం పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను పెట్టి ఓటరుగా నమోదు చేయడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. డిగ్రీ సర్టిఫికెట్‌ జిరాక్స్‌పై గెజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ లేకపోయినా 2,600 మందిని ఓటర్లుగా నమోదు చేశారు. అభ్యర్థి పేరు ఒకరిదికాగా, సర్టిఫికెట్‌ మరొకరి పేరు మీదున్నది జతచేసి జాబితాలో నమోదు చేయడం గమనార్హం. 2013 సంవత్సరానికి ముందు డిగ్రీ పూర్తి చేసిన వారే  అర్హులని ఎన్నికల నియమావళిలో ఉన్నా అవేవీ పట్టించుకోకుండా ఈ తర్వాత పూర్తి చేసిన వారిని కూడా ఓటర్ల జాబితాలో చేర్చారు. ఈ విధంగా ఏకంగా ఐదువేలకు పైగా ఆన్‌లైన్‌ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని ఓటర్లుగా నమోదు చేసినట్టు ఆధారాలతో సహా బయటపడ్డాయి. 

తప్పుడు నమోదుల్లో కొన్ని.. 
ఎస్‌.భార్గవి, ఐడీ నెంబర్‌ ఎఫ్‌ 18–055076652, సుజాత సర్టిఫికెట్‌ పేరుతో నమోదు చేయించుకున్నారు. 
చిన్న లక్ష్మమ్మ, ఐడీ నెంబర్‌ ఎఫ్‌ 18–250126331, టి. రాఘవేంద్ర సర్టిఫికెట్‌ పేరుతో నమోదైంది. 
హరికృష్ణ నాయక్‌ ఎఫ్‌ 18–774575156, కమ్మ శ్రీనివాసులు సర్టిఫికెట్‌ పేరుతో నమోదైంది. 
లక్ష్మి నరసింహులు, ఐడీ ఎఫ్‌ 18–0213270334 డిగ్రీ మూడో∙సంవత్సరం సర్టిఫికెట్‌ మాత్రమే అప్‌లోడ్‌ చేశారు.
కె.హీరాలాల్, ఐడీ ఎఫ్‌ 18–665517404, కేవలం ఉద్యోగ ఐడీతో నమోదు చేశారు. 
ఉమామహేశ్వరుడు, ఐడీ ఎఫ్‌ 18– 704122557, కేవలం సంతకం పెట్టిన కాగితంతో నమోదు చేశారు.

తాజా వీడియోలు

Back to Top