రాష్ట్రాన్ని దోచేసిందెవరు బాబూ..?

‘రైతులను దోచుకోవాలనుకుంటే ఖబడ్డార్‌..’ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తా... నిన్న అనంతపురంలో జరిగిన ఏరువాక కార్యక్రమంలో చంద్రబాబు రైతుల పక్షాన శివాలెత్తి పోయారు. రైతు పక్షపాతిగా, రైతోద్ధారుకుడిలా కలరింగ్‌ ఇచ్చేశారు. చాలా గొప్పగా సెలవిచ్చేశారు బాబోరు. ఇంతకీ రైతులను దోచుకుంటోంది ఎవరు.. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు.. ఏ పార్టీలో రౌడీలున్నారు. ఎవరు ఎవరి మీద దౌర్జన్యాలు చేస్తున్నారో చంద్రబాబుకు మర్చిపోయిన్నట్టున్నారు. 

రైతులను దోచుకుంటోంది ఎవరు..
2014 ఎన్నికలకు ఇంకా సంవత్సరం ఉందనగానే చంద్రబాబు మీకోసం పేరుతో పాదయాత్ర చేపట్టారు. అప్పట్నుంచి ఎన్నికల వరకు రైతులకు రుణమాఫీ చేస్తానని మైకు దొరికినప్పడుల్లా డప్పు కొడుతూనే ఉన్నాడు. తీరా అధికారంలోకి వచ్చాక మొత్తం మాటతీరే మారిపోయింది. మొత్తం రుణమాఫీ చేస్తానని నేను చెప్పలేదు. రైతులు అత్యాశకు పోకూడదు. అంత ఖర్చు పెట్టి ఎవరు నష్టపోమన్నారు.. లాంటి చీదరింపు మాటలతో రైతులను వంచించింది చంద్రబాబు కాదా. 87లక్షలున్న రైతులను బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ లింకులు, పాసు పుస్తకాలు నానా అవస్థలు పెట్టి 23 లక్షలకు కుదించింది చంద్రబాబు కాదా. ఉపాధి కోసం రైతులు పక్క రాష్ట్రాల్లో కూలీలుగా బతుకుతుంటే రెయిన్‌ గన్‌లతో కరువును పారదోలానని గొప్పలు చెప్పుకుంది టీడీపీ ప్రభుత్వం కాదా. ఇన్‌పుట్‌ సబ్సిడీ మిగిలిపోయింది ఎవరు. ఎన్నికలకు ముందు రూ. 5 వేల కోట్లతో రైతులకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని మూడేళ్లు గడిచినా ఆ దిశగా ఆలోచన చేయనిది ఎవరు చంద్రబాబు కాదా. మిర్చి సహా అనేక పంటలకు మద్దతు ధర లేక పండించిన పంటను రోడ్డుమీద తగలేసి నిరసన తెలుపుతుంటే ఏమీ పట్టనట్టు అమెరికా పారిపోయింది చంద్రబాబు కాక ఎవరు.

టీడీపీ ప్రక్షాళనతోనే రౌడీయిజం అంతం
ఏరువాకలోనే చంద్రబాబు మరో గొప్ప మాటన్నారు రౌడీయిజం సహించనని. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో 15 మంది వైయస్‌ఆర్‌సీపీ నాయకులును అతి కిరాతకంగా చంపితే ఏం చేశారు. చెరుకులపాడు నారాయణరెడ్డిని అతి క్రూరంగా చంపితే ఏం చర్యలు తీసుకున్నారు. బాబు క్యాబినెట్‌లోనే ఉన్న డీప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆయన కొడుకు శ్యాంబాబులే చంపించారని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి ఆరోపిస్తే ఏం చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ కేఈ చేత రాజీనామా చేయించాల్సింది పోయి అవన్నీ ఫ్యాక్షన్‌ హత్యలేనని సిల్లీ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసి లైట్‌ తీసుకోవడం ముఖ్యమంత్రికి తగునా..? ముఖ్యమంత్రి చేయాల్సింది ఇదేనా.. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ మూడేళ్లలో 550 మంది హత్యలకు గురై చనిపోయారని పోలీసు రికార్డులే చెబుతున్నాయి. చింతమనేని ప్రభాకర్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, విజయవాడ నడిబొడ్డున ఐపీఎస్‌ బాలసుబ్రహ్మణ్యంను అడ్డుకుని దుర్భాషలాడిన బోండా ఉమ, నాగుల్‌మీరా, ఎంపీ కేశినేని నాని, రైల్వే కాంట్రాక్టర్లను బెదిరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు టీడీపీ నాయకులు.. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చెలాయిస్తున్న వారంతా టీడీపీ నాయకులే. మరి ముఖ్యమంత్రి రౌడీయిజం అణచాలంటే ఎవరి మీద చర్యలు తీసుకోవాలి.  దాడులు, దౌర్జన్యాలు, హత్యా రాజకీయాలు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న చంద్రబాబు పార్టీ రాబోవు రోజుల్లో అంతమొందడం ఖాయమని పలువురు హెచ్చరిస్తున్నారు. 

Back to Top