టీడీపీ..తెలుగు దొంగల పార్టీ

()చంద్రబాబు అడుగుజాడల్లో తెలుగు తమ్ముళ్లు
()రోజుకో అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతి బాగోతం బట్టబయలు
()సంక్షేమం విస్మరించి ప్రజాధనం లూటీ
()టీడీపీ రెండున్నరేళ్ల పాలనలో అంతులేని అవినీతి

తెలుగుదేశం పార్టీ తెలుగు దొంగల పార్టీగా మారిపోయింది. చేతిలో అధికారం ఉంది... మీడియా సపోర్ట్ ఉంది. కేసులు పెట్టి పోరాడే ధైర్యం జనానికి లేదు. పోలీసులూ వారి పక్షమే.. ఏం చేసినా అడిగే దిక్కులేదు. దీంతో, అందినకాడికి దోచుకుంటూ తెలుగుతమ్ముళ్లు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు.  టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్యవధిలో రూ.1.45 లక్షల కోట్లు అవినీతి జరిగింది.  చంద్రబాబును ఆదర్శంగా తీసుకున్న ఎమ్మెల్యేలు కూడా అదే రూట్‌లో వెళ్తున్నారు. దొరికిందల్లా స్వాహా చేస్తూ అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతిపై ప్రతిపక్షాలు పోరాడినా ముఖ్యమంత్రి చూసుకుంటాడులే అన్న ధీమాతో చెలరేగిపోతున్నారు. సంపాదనే పరమావధిగా అధికారమే పెట్టుబడిగా తెలుగుతమ్ముళ్లు సాగిస్తున్న అరాచకాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
  
అవినీతి ఎమ్మెల్యేలకు బాబే రాజగురువు
తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదలు ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతిలో తెగ పోటీపడుతున్నారు. దోపిడీలో దూసుకుపోతున్నారు.  ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అవినీతిలో మొదటి స్థానంలో సంపాదించింది.  రాష్ట్రాన్ని ఏదో ఉద్దరిస్తారని జనం  ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే..పచ్చనేతలు మాత్రం  దోపిడీకి బాటలు వేసుకుంటున్నారు. దాడులు, దౌర్జన్యాలు, దందాలు,  అడ్డొచ్చినవారిపై బెదిరింపులకు దిగుతూ అరాచక పాలన సాగిస్తున్నారు. ల్యాండ్‌ మాఫియా, లిక్కర్ మాఫియా, సాండ్‌ మాఫియా, మైనింగ్‌ మాఫియా, కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్ ఇలా  రాష్ట్రంలో అంతులేని అవినీతి కుంభకోణాలతో పచ్చపార్టీ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఈ అవినీతి ఎమ్మెల్యేలందరికీ రాజ గురువు సాక్షాత్తు ముఖ్యమంత్రే. ఈయన వందల కోట్ల రూపాయలిచ్చి ఎమ్మెల్యేలను కొని దొరికి పోగా లేనిది... హెరిటేజ్‌ కంపెనీకి రూ.39 కోట్లు దోచిపెట్టగా లేనిది.. కాంట్రాక్టర్ల నుంచి ‘లోకేశ్‌ ట్యాక్సు’లు వసూలు చేయగా లేనిది.. మేం చేస్తే తప్పా. ఇదే ఎమ్మెల్యేలు ఒంటపట్టించుకున్నారు కాబోలు. అందుకే ఎలాగైనా తమ బాస్‌నే ఢీకొట్టాలని అహర్నిశలు కష్టపడి దోచుకుంటున్నారు. జలగలా ప్రజల్ని పీల్చుకు తింటున్నారు. 

రూ.5 కోట్లు లంచం ఇవ్వాలంటూ బెదిరింపులు
రాపూరు– కృష్ణపట్నం రైల్వే పనులు జరగాలంటే తనకు రూ. 5కోట్లు లంచం ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ మూడు రోజుల క్రితం కాంట్రాక్టర్‌ను బెదిరించిన విషయం వెలుగు చూసింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో మాంటో కార్గో కంపెనీ రైల్వే పనులు చేపడుతోంది. అయితే తనకు కమీషన్‌ ఇవ్వకుంటే పనులు అడ్డుకుంటానని ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించినట్లు మాంటో కార్గో సెక్రటరీ కల్పేశ్‌ దేశాయ్‌ మీడియాతో చెప్పారు. చంద్రబాబు పాలనలో అవినీతి ఉండదని తామొస్తే ఇక్కడ మాత్రం పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వాపోయారు. పనులు చేస్తుంటే వచ్చి తమ సిబ్బందిపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు కూడా చేశారని పేర్కొన్నారు. తాము ఇలాంటి చోట పనులు చేయలేమని కావాలంటే కాంట్రాక్ట్‌ వదిలేసి వెళ్తామని .. ఇలా లంచాలు ఇచ్చే ప్రసక్తే లేదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఈ విషయంపై జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబు సైతం నోరుమెదపకపోగా వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే రామకష్ణపై తొలి నుంచి చాలా తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఎరచ్రందనం స్మగ్లింగ్‌లో ఈయనకు తిరుగులేదన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా కాంట్రాక్టర్లు తొలుత రామకృష్ణకు డబ్బులు చెల్లించుకోవాలట. గతంలో కలెక్టర్‌ మీద దౌర్జన్యం చేసిన చరిత్ర కూడా ఈయనకు ఉంది.

టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్లపై ఐటీ దాడులు
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల ఇళ్లపై మూడు రోజులుగా ఐటీ దాడులు జరుగుతుండటం గమనార్హం. మూడు రోజుల క్రితం టీడీపీకి చెందిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇంటిపై సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు అక్రమాస్తులు కనుగొన్నట్లు అన్ని పత్రికల్లోనూ వెలుగుచూసింది. బెంగళూరులోని ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సంబంధించి అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించి పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ మరుసటి రోజే చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభకు చెందిన కంపెనీలపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేసి దాదాపు రూ.300 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.  బెంగళూరులోని వైదేహీ, మాల్యా ఆసుపత్రుల్లో దాడులు చేయగా దాదాపు రూ.265 కోట్ల ఆస్తులకు సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్‌ చేసినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌ 23 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆమె కంపెనీలు, ఇళ్లలో జరిగిన సోదాల్లో ఎమ్మెల్యేకు సంబంధించిన విద్యా సంస్థల నుంచి దాదాపు రూ.43 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు పేర్కొన్నారు. 13 సంవత్సరాల ఆదాయ ఖర్చుల వివరాలు తెలపాల్సిందిగా అధికారులు ఆమెను ఆదేశించారు. 

బోండా ఉమా భూ కబ్జా
ఆంధ్రప్రదేశ్‌ను నవ్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ప్రగల్భాలు పలుకుతున్న టీడీపీ నేతలు ఆ ముసుగులో భూ దురాక్రమణకు పాల్పడి కోట్లకు పడగలెత్తున్నారు. పేదల భూములు దోచుకొని రియల్‌ ఎస్టేట్‌  వ్యాపారం చేస్తున్నారు. తాజాగా విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా భూ బాగోతం బయటపడింది. విజయవాడ కండ్రిగలో రూ. 10 కోట్లు విలువ చేసే భూమిని విలేకరులకు కేటాయిస్తామని చెప్పి ఆ భూమిని కబ్జా చేశారు. విజయవాడ కార్పొరేషన్‌కు చెందిన విలువైన స్థలాన్ని తనకు సొంతమైందిగా చిత్రీకరించుకొని ఆ స్థలంలో వాణిజ్య భవనాన్ని నిర్మించేందుకు సిద్ధపడ్డారు. 

ఒక్క కేసు లేదు
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల సమయంలో భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడింది. అధినేత మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుమారులు చేసిన భూకబ్జాలు, దందాలు అన్నీ ఇన్నీ కావు. ఇన్ని జరిగినా అధికార పార్టీ నేతలపై ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడలో వెలుగుచూసిన కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ వ్యవహారం లో అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల వికృత క్రీడ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతవరకు అరెస్ట్ లు లేవు. విచారణ అంతకన్నా లేదు. పైగా  కేసును నీరు గార్చేందుకు కమిషనర్‌ను సెలవులపై పంపి  చంద్రబాబు తన మార్కు రాజకీయాన్ని చేసి ప్రజా సమస్యల్ని ఉక్కుపాదంతో తొక్కేశారు.

దోపిడీ రాజాలు
గుంటూరు జిల్లా నర్సారావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో రైల్వే పనులు జరగకుండా లంచాల కోసం స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడు శివరామ్‌ కాంట్రాక్టర్‌ లను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక అక్రమ రవాణకు అడ్డుపడిన మహిళా తహశీల్దార్‌ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బౌతిక దాడికి పాల్పడ్డారు. అటవీ అధికారుల మీద దాడి చేసి కొల్లేరులో సొంత రోడ్డు వేసుకున్నారు.  అంగన్‌వాడీలను సభ్య సమాజం రాయలేని, వినలేని భాషలో అన్యాయంగా దుర్భాషలాడిన  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మీద కేసులు లేకుండా చేయటమే కాకుండా, బిరుదు సత్కారాలు చేసి, రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ (పనితీరులో) ఎమ్మెల్యేగా ఈ రాక్షస రాజ్యంలో సన్మానాలు జరగడం దురదృష్టకరం.  తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పేందుకు స్వర్గీయ ఎన్‌టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపిస్తే..ఆయనకు వెన్నుపోటు పొడిచి టీడీపీని కైవసం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు తెలుగు దొంగల పార్టీగా మార్చారు. బాబు అండ్ కో అరాచకాలు, అక్రమాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. అధికార టీడీపీకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
Back to Top