అంతా మీరే చేశారు..


హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద చంద్రబాబు చేస్తున్న కుటిల పన్నాగాలకు రాష్ట్ర ప్రయోజనాలు ఆవిరై పోతున్నాయి. విభజన సమయంలో నాటి ప్రధాని చట్ట సభల సాక్షిగా ఇచ్చిన హామీలు స్పష్టంగా ఉన్నప్పటికీ, కేంద్రం నుంచి కార్యాచరణ రాబట్టడంలో చంద్రబాబు విఫలం అయ్యారు. 
రాజధానిని సింగపూర్ కు తాకట్టు పెట్టడం ద్వారా చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థానికి పెద్ద పీట వేశారు. ఈ కుంభకోణం మీద కేంద్ర ప్రభుత్వం ద్రష్టి పెట్టకుండా బయట ఉండేందుకు ఈ ఎత్తుగడ వేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. భవిష్యత్ లో కేసులు రాకుండా ఉండాలంటే, చంద్రబాబు కేంద్రంతో లాలూచీ పడుతున్నారనిపిస్తోంది. దీని పర్యావసానంగా రాష్ట్రానికి చెందిన కొన్ని తరాల ప్రజానీకం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఇదంతా ఒక ఎత్తయితే, ఈ విషయాలు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ముఖ్యమంత్రి సహామంత్రులంతా మైండ్ గేమ్ కు పాల్పడుతున్నారు. ఒక నాయకుడు అదిగదిగో ప్రత్యేక హోదా అంటే, ఇంకో నాయకుడు ప్రత్యేక హోదానా వంకాయా అంటున్నారు. అదేమీ అవసరం లేదు, ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది అని మరో నాయకులు సరిపెట్టేస్తున్నాడు. దీంతో ప్రజల ద్రష్టిని సాధ్యమైనంత దాకా పక్కకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. 
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యలు ఇదే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి వద్దని, సహకారాత్మకంగానే వెళ్లాలని ఆయన చెప్పటం గమనార్హం. కేంద్రంతో  గట్టిగా పోరాడితే, సింగపూర్ కుంభకోణం బయటకు వస్తుందని బెంగ పడుతున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబు ఈ వైఖరిని పార్టీ నాయకులకు సూచించినట్లు అర్థం అవుతోంది.
Back to Top