టిడిపి గూండాల రాజ్యం

-జగన్ ను ఢీకొనలేమని తెలుసుకున్న చంద్రబాబు
-రౌడీ రాజకీయాలకు తెరలేపిన పచ్చపార్టీ నేతలు
-సర్వేల పేరుతో బెదిరింపులు
-భయభ్రాంతులకు గురౌతున్న నంద్యాల ప్రజలు

ఎలక్షన్లు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు, నాయకులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో ప్రచారాలు చేయడం మామూలే. కాని టిడిపి దారే వేరు. గూండాయిజం, రౌడీయిజానికి పెట్టింది పేరులా ప్రవర్తించే ఆ పార్టీ నేతలు, వారికి తోచిన దుర్నీతితోనే ఎలక్షన్ లో గెలవాలనుకుంటున్నారు. నంద్యాల బై పోల్ కోసం టిడిపి చేసే రాజకీయంను చూసి రాష్ట్రమంతా విస్తుపోతోంది. 
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ప్రచారంలో భాగాంగా రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. ఆ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేని టిడిపి నేతలు ప్రజలను భయపెట్టి జన నేత నుండి వారిని దూరం చేయాలనుకున్నారు. కిరాయి మూకలను రంగంలోకి దింపారు. టిడిపి అనుచరులుగా, పార్టీ కార్యకర్తలుగా వారికి పసుపు రంగు పూసి మరీ తీసుకొచ్చారు. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు కొందరు విద్యార్థులను వారిలో కలిపారు. వీరందరికీ రహస్యంగా ట్రైనింగ్ లు ఇచ్చి, సర్వేల పేరుతో ఇంటింటికీ పంపించారు. టిడిపికి వ్యతిరేకంగా ఉన్నారని అనిపించిన వారిని బెదిరించడం, ప్రలోభ పెట్టడం ఈ బృందాల పని. ఇంత జరుగుతుంటే ఎన్నికల అధికారుల నిఘా, పోలీసు బలగాల పహారా ఏమయ్యాయని ఇక్కడెవరూ ప్రశ్నించకూడదు. అధికారం చేతిలో ఉంచుకుని అన్యాయానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన వారికి అధికారులంతా సెల్యూట్ చేయడం తప్ప మరేం చేయరని మనం తెలుసుకోవాలి. 
దొంగలను పట్టించిన వైయస్సార్సీపీ నాయకులపైనే ఎదురు కిడ్నాప్ కేసులు బనాయించారు అధికార పార్టీ నేతలు. దానికి తాన తందానా అన్నారు పోలీసు అధికారులు. ఇదెక్కడి చోద్యం అని నోరు నొక్కుకోనక్కర్లేదు. తెలుగు దేశం పార్టీ పాలన ఉన్నప్పుడు రాష్ట్రంలో ఇంతకు మించిన న్యాయం ఆశించడం నిజంగా అన్యాయమే అవుతుంది. 
ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల ప్రాంతాన్ని టిడిపి రణరంగంగా మార్చేసింది. ఏ రోజు ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. పింఛన్లు రావాలన్నా, పథకాలు రావాలన్నా టిడిపికి ఓటేయండి లేదంటే అవన్నీ ఆపేస్తారు అని బెదిరింపులకు పాల్పడుతోంది. 
ప్రజాస్వామికంగా జరగాల్సిన ఎన్నికల్లో నియంతృత్వపు పోకడలు మంచివి కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నంద్యాల లో వైయస్సార్సీపిని ఎదరించి గెలవడం అసాధ్యం అని అర్థం అయిపోయింది కనుకే తెలుగు దేశం నేతలు ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పాల్పడుతున్నారని సీనియర్ నేతలు అంటున్నారు. సొంత పార్టీ నేత జె.సి దివాకర్ రెడ్డే ఆ విషయాన్ని మీడియా ముందు ఒప్పుకున్నారు కూడా. చంద్రబాబు హిట్లర్ పాలనకు, రౌడీ రాజకీయాలకు ఇక తెరపడినట్లే. 

Back to Top