నంద్యాల్లో దాడులకు టిడిపి పథకం

నంద్యాల నలుచెరగులా టిడిపి గూండా గిరీ కనిపిస్తోంది. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నరోజుల్లో కూడా ప్రశాంతంగా ఉన్న నంద్యాల పట్నం నేడు టిడిపి రౌడీల పహారాలో బిక్కుబిక్కు మంటోంది. టిడిపి నేతల దౌర్జాన్యం, అధికారపార్టీ నియంతృత్వం, చంద్రబాబు నిజస్వరూపం బైటపడ్డ సందర్భం ఇది. వైయస్సార్సీపీ నంద్యాల ఎన్నికల్లో తన అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండి ఉంటే చంద్రబాబు గూండాగిరీ బైటపడేదే కాదని ప్రజాశ్రేణులు అంటున్నాయి. ఎన్నికల్లో ఇంతటి బరితెగింపును ఎన్నడూ చూడలేదని నంద్యాల వాసులు బాధపడుతున్నారు.

మద్యం విధానానికి వారసులు
మద్యనిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని వైయస్సార్సీపీ అధినేత ప్రకటించారు. రెండో పక్క టిడిపి నేతలు కోట్ల రూపాయిల మద్యాన్ని గ్రామ, పట్టణ శివార్లలో పెట్టి తాగినంత తాగండని సీసాలు అందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మద్యనిషేధం అన్న టిడిపి సర్కార్ స్వయంగా మందుచేతికందిస్తూ ప్రజలను మద్యానికి బానిసలను చేస్తోంది. పైకి నవ్వుతూ పొట్టలో బాకులు దించడం టిడిపికే చెల్లింది.  

దొంగతనం, దౌర్జన్యం టిడిపి సంతతే
ఒకప్పుడు సొంత పార్టీ  ఎమ్మెల్యేలను దొంగిలించి హోటల్లో బలవంతంగా దాచిపెట్టి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. అప్పుడే టిడిపికి పుట్టిన కవలపిల్లలు అయ్యాయి దోపిడీలు, దొంగతనాలు. మామగారి పార్టీని, నాయకులను, ఆస్తులను దొంగిలించాడు చంద్రబాబు. ఆ తర్వాత పక్క పార్టీల నుంచి కూడా ఎమ్మెల్యేలను దొంగిలించి తన పార్టీలో కలుపుకున్నాడు. నేతలెందరిని దొంగిలించినా ప్రజా ఆస్తికి నష్టం ఉండదు. అందుకే ఇహ ప్రజలను కూడా డబ్బుతో కొనడమో, బలవంతం చేసి దొంగిలించి దాచడమో చేస్తున్నాడు. వార్డులోని ప్రజలను దుర్మార్గంగా రౌడీలతో, గూండాలతో సమీకరించి, దర్గాల్లో మసీదుల్లో దాచి తాళం వేయడం ఎంత నీచమైనా రాజకీయం. 

దాడుల నాటకానికి తెరతీసిన టిడిపి
నంద్యాల ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. దాడులు జరగబోతున్నాయని, అది చేసేది వైయస్సార్సీపీ అని టిడిపి అన్నది. అంటే ఈపాటికే నంద్యాల మొత్తంగా మొహరించిన అధికార పార్టీ గూండాలు అల్లర్లకు ప్లాన్ రెడీ చేసుకునే ఉన్నారని అనుమానం వ్యక్తం అవుతోంది. దొంగతనాలు, నిర్బంధాలు, నల్లడబ్బుని నడిరోడ్డుమీద పంచడాలు, బెదిరించడాలు, ప్రలోభపెట్టడాలు…ఇలాంటి దుర్మార్గాలన్నీ అయిపోయాయి. ఇక మిగిలింది దాడులే. కనుక ఇప్పటికే రంగంలోకి దించిన తమ రౌడీ మూకతో అల్లర్లకు, దాడులకు టిడిపి నేతలు తెగబడనున్నారని ఆ పార్టీ అసలు రంగు తెలిసిన సీనియర్లు హెచ్చరిస్తున్నారు. దిగజారుడు తనంతో వారు చేసిన అక్రమాలను వైయస్సార్సీపీపై నెట్టడంతో వారి పన్నాగం పూర్తవుతుందని కూడా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల సంఘం ఈ రహస్యాన్ని ఛేదించి ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సి ఉంది. ప్రజలకు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. 


తాజా వీడియోలు

Back to Top