చంద్రబాబు పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది.అధిష్ఠానం అండదండలతో టీడీపీ నేతలు ప్రేటేగిపోతున్నారు.టీడీపీకి ఓటమి భయం పట్టుకోవడంతో ప్రశ్నించివారిపైనే దాడులకు పాల్పడుతున్నారు. టీడీపీ పాలనలో వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యాన్ని విలువల్ని కాలరాస్తున్నాయి. అధికార పార్టీ అరాచకాలు శృతిమించాయి.ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారు.అధిష్ఠానం అండతో అధికారపార్టీ నేతలు ప్రేటేగిపోతున్నారు.అధికార ఉన్మాదంతో దళితులపై దాడులకు పాల్పడి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు. టీడీపీ పాలనలో దళితుల భూములు లాక్కుని వారికి నిలువ నీడ లేకుండా చేయడంతో పాటు..సమస్యలపై ప్రశ్నించిన వారిపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. పశ్చిమగోదావరిలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితుల చులకన మాట్లాడి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన సంగతి తెలిసిందే. నిన్న చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మద్దతుగా నిలిచిన దళితులు,దళిత మహిళలను టీడీపీ నేత పులివర్తి నాని అనుచరులు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి ప్రయత్నించారు. నిన్న పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం లింగంపాడు దళితులపై టీడీపీ నేతలు దాడులు చేయడం ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఉంగుటూరు టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకు స్థానిక సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన దళితులపై ఆయన అనుచరులు,కార్యకర్తలు దాడికి దిగారు. రోడ్లు,డ్రైనేజీలు లేవని నిలదీయడం.. వారి ఆగ్రహానికి కారణమైంది.ఎమ్మెల్యే సమక్షంలో దళితులపై పిడిగుద్దులతో దాడి చేశారు. చెప్పులతో కొట్టారు.గాయపడిన దళితులు బీమడోలు ఆసుప్రతిలో చికిత్సపొందుతున్నారు. వారిని వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వుప్పాల వాసుబాబు పరామర్శించారు. దాడిచేసినవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.టీడీపీ ప్రభుత్వం దళితుల పట్ల నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోంది.దళితుల దాడులు జరిగినా,వారి భూములను అన్యాయంగా లాక్కున పట్టించుకున్నా పాపాన పోలేదు.దళిత మహిళలపై దాడులు,అత్యాచారాలు జరుగుతున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.దళితులకు సంక్షేమపథకాలు దేవుడెరుగు కనీసం భద్రత,రక్షణ లేకుండా పోతుంది.చంద్రబాబు పాలనలో ఈ ఐదేళ్లు దళితులు నిత్యం అభద్రత భావంతో జీవిస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళితులపై టీడీపీ అరాచకాలు పెరిగిపోయాయి.ఎన్నికల్లో ఓడిపోతామనే అసహనం టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.దీంతో దళితులపై దౌర్జన్యాలకు దిగుతున్నారు.టీడీపీ నేతలు,కార్యకర్తలు దళితులపై దాడిచేయడం పరిపాటిగా మారింది.గతంలో చంద్రబాబు ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని దళితుల పట్ల చులకన భావంతో మాట్లాడారు.టీడీపీకి చెందిన మంత్రులు కూడా దళితులను అవమానించేవిధంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.