భూ సేక‌రణ మీద బొమ్మ‌లాట‌..!

కొత్త నాట‌కానికి తెర దీసిన ప్ర‌భుత్వం
సంబంధం లేదంటున్న రెవిన్యూ మంత్రి
అంతా నారాయ‌ణ మ‌యం అంటున్న అధికారులు

హైద‌రాబాద్: రాజ‌ధాని లో భూ సేక‌ర‌ణ‌కు సంబంధించి కొత్త నాట‌కం బ‌య‌ట ప‌డింది. దీంతో త‌న‌కు సంబంధం లేద‌ని స్వ‌యంగా రెవిన్యూ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి తేల్చేశారు. అయినా పూర్తి చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది.

రెవిన్యూ మంత్రి పాత్ర‌
రాష్ట్రంలో భూముల‌కు సంబంధించిన లావాదేవీలు అన్నీ రెవిన్యూ శాఖ కింద‌కు వ‌స్తాయి. సాధార‌ణంగా వీటికి సంబంధించిన నిర్వ‌హ‌ణ‌, ప‌రిపాల‌న అంతా ఆ శాఖే చూసుకొంటుంది. కానీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి ప్రాంతాన్ని ఎంపిక చేసిన‌ప్ప‌టి నుంచీ రెవిన్యూ మంత్రి పాత్ర పెద్ద‌గా క‌నిపించ‌టం లేదు. రాజ‌ధాని ఎంపిక‌, భూ స‌మీక‌ర‌ణ‌, ఆ త‌ర్వాత భూ సేక‌ర‌ణ ఇలా ఏ ద‌శ‌లోనూ ఆయ‌న ప్ర‌స్తావ‌న లేకుండానే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదే విష‌యాన్ని రెవిన్యూ మంత్రి , సీనియ‌ర్ నాయ‌కుడు కే ఈ కృష్ణ మూర్తి కుండ బ‌ద్ద‌లు కొట్టి చెప్పేశారు.

అంతా నారాయ‌ణ మ‌యం
రాజ‌ధాని వ్య‌వ‌హారాల్లో మునిసిప‌ల్ మంత్రి నారాయ‌ణ చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భూ సేక‌ర‌ణ జ‌రిపించటం, బెదిరించి భ‌య‌పెట్టి రైతుల నుంచి భూములు లాక్కోవ‌టంలో ఆయ‌న పాత్ర కీలకం. త‌ర్వాత సింగ‌పూర్ సంస్థ‌ల‌తో రాయబారాలు అన్నీ ఆయ‌న ద్వారానే జ‌రిగాయి. ఒక్క మాట‌లో చెప్పాలంటే మునిసిప‌ల్ వ్య‌వ‌హారాల్ని గాలికి వ‌దిలేసి మ‌రీ, ఆయ‌న రాజ‌దాని వ్య‌వ‌హారాల్లో మునిగి తేలుతున్నారు. రాజ‌ధానికి సంబంధించి స‌మ‌స్తం ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంది. 

కొత్త నాట‌క‌మా..!
సంబంధిత శాఖ మంత్రికి సంబంధం లేకుండా చంద్ర‌బాబు చేస్తున్న హ‌డావుడి అంతా ఇంతా కాదు. సంబంధిత మంత్రికి సంబంధం లేకుండా నారాయ‌ణ‌తోనే అన్ని వ్య‌వ‌హారాలు న‌డిపించ‌టం మీద అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సింగ‌పూర్ సంస్థ‌ల‌తో అవినీతి డ‌బ్బుల లావాదేవీలు ఉన్నాయ‌ని, అందుకే నారాయ‌ణ‌తో లావాదేవీలు సాగిస్తున్నార‌నే మాట వినిపిస్తోంది. దీని మీద నారాయ‌ణ నేరుగా మాట్లాడ‌కుండా లాండ్ పూలింగే త‌మ అభిమ‌త‌మ‌ని, చంద్రబాబు అదే కోరుకొంటున్నార‌ని కొత్త రకం వాద‌నలు వినిపిస్తున్నారు. 
Back to Top