వరదలు అంటే మాకెంతో ముద్దు..!



వరదలు అంటే చాలా మంది
భయపడతారు. కానీ, తెలుగుదేశం నాయకులు మాత్రం చాలా సరదా పడుతున్నారు.

మొన్నటి వరదలు చిత్తూరు,
నెల్లూరు జిల్లాలను అతలాకుతలం చేశాయి. కొంత మేర ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్ని
ఇబ్బంది పెట్టాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో తాత్కాలికంగా సహాయ పనులు చేపట్టారు. వరద
ఉధ్రతి మందగించాక, శాశ్వత పనులు చేపట్టడం రివాజు. ఇందుకు గాను అధికారులు ఏర్పాట్లు
చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ
అధికారంలోకి రాగానే నీరు..చెట్టు పనులు, ఇసుక తవ్వకాల్ని తెలుగుదేశం తాబేదార్లకు
అప్పగించేశారు. నిబంధనలకు పాతరేసి పనుల్ని పంచేసుకొన్నారు. ఈ సందర్భంగా అధికార
యంత్రాంగంతో పచ్చ చొక్కా తమ్ముళ్లు అవగాహన పెంచుకొన్నారు. రూల్స్ చెప్పే
అధికారుల్ని భయపెట్టి దూర ప్రాంతాలకు పంపించేసుకొన్నారు. దీంతో పద్దతిగా ప్రభుత్వ
సొమ్ముల్ని తినేయటాన్ని వ్యవస్థీక్రతం చేసుకొన్నారు.

ఈ లోగా వరదలు వచ్చి
పడ్డాయి. నాలుగు జిల్లాల్లో వరద పనుల్ని దక్కించుకొనేందుకు తెలుగు తమ్ముళ్లు
పోటీపడుతున్నారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ కు సంబంధించిన
విభాగాల్లో పనులు అంచనాలు వేస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లా విషయాన్నే
తీసుకొంటే.. వరదలకు రూ. 350 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా
వేస్తున్నారు. వీటి నుంచి బయట పడేందుకు తక్కువలో తక్కువ రూ. 300 కోట్ల మేర పనులు
దక్కుతాయని భావిస్తున్నారు. ఈ లెక్కన చూస్తూ నాలుగు జిల్లాల్లోనూ రూ. వెయ్యి కోట్ల
మేర పనులు దక్కుతాయని భావిస్తున్నారు.

వాస్తవానికి గత ఏడాది
విశాఖలో హుద్ హుద్ తుపాన్ అల్లకల్లోలం చేసినప్పుడు అక్కడ తెలుగు తమ్ముళ్లు
గద్దల్లా వాలిపోయారు. అడ్డూ అదుపు లేకుండా సహాయ చర్యల్ని పంచుకొని తినేశారు.
అడ్డగోలుగా డబ్బును దోచేసుకొన్నారు. దీంతో సహాయ చర్యలు పూర్తయి ఏడాది గడచిన
సందర్బంగా చంద్రబాబు ఒక విజయోత్సవాలు జరిపించారు. కానీ ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా
నిర్మించకుండానే ఎల్లో మీడియా సాయంతో విజయోత్సవాలు చేయించేసుకొన్నారు. ఈ ఉత్సాహంతో
వరద పనుల్లో భారీగా వాటాలు దక్కించుకోవచ్చని తెలుగు తమ్ముళ్లు ఉరకలు వేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top