టీడీపీ బీమా బోగస్సే

బాధిత కుటుంబాలకు అందని పరిహారం
చంద్రబాబు మాటల్లాగే తయారైంది టీడీపీ సభ్యత్వ నమోదు కూడా. ప్రమాద బీమా ఆశ చూపి సభ్యత్వాలు చేయించుకోవడమే తప్ప వారి బాగోగులు మాత్రం టీడీపీ నాయకులు పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ఠంచన్‌గా సభ్యత్వం ఇస్తున్నాం.. ప్రజలు అభిమానంతో ఎగబడి పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు అని ప్రచారం చేసుకోవడం తప్పించి ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైన వారిని పట్టించుకోకుండా వారి మానాన వారిని అలాగే వదిలేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి వారి పిల్లలు రోడ్డున పడినా స్థానిక టీడీపీ నాయకులు కల్పించుకుని వారికి బీమా సొమ్మును ఇప్పించి ఆదుకోవడం లేదు.

తూర్పు గోదావరి జిల్లా  బిక్కవోలు మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మామిడి అప్పారావు, సూర్యకుమారి దంపతులు కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తూ వారి ఇద్దరు కుమార్తెలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. 2014వ సంవత్సరంలో అప్పారావు తన పొలంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై ఇంటికి వచ్చి  కుప్పకూలిపోయాడు. ఆ విషాదం నుంచి కోలుకోకుండానే తల్లి  సూర్యకుమారి వ్యవసాయ పనులకు ఆమె మరిది, తోడికోడలు వెంకటలలక్ష్మితో కలిసి బైక్‌పై వెళ్తుండగా పిఠాపురం సమీపంలో జల్లూరు వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయింది. దీంతో ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. వెంకటలక్ష్మి మాత్రం ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక కాలు కోల్పోయి మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది.

ఆదుకోని ప్రధాన మంత్రి బీమా యోజన
చిన్నారుల తల్లి సూర్యకుమారి అసంఘటిత కార్మికురాలు కావడంతో ఆమె పేరున అనపర్తి ఆంధ్రాబ్యాంక్‌లో ఖాతా తెరిచారు. ప్రధాన మంత్రి బీమా యోజన పథకంలో భాగంగా ఏటా రూ.12 ఆమె ఖాతా నుంచి తీసుకుని బీమా కల్పించాల్సి ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారు చనిపోతే రూ.2 లక్షలు ఆ కుటుంబానికి అందచేయాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకు ఆ సొమ్ము అందలేదు. ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని వారి తాత ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిరగుతున్నా పని మాత్రం కావడం లేదు. 

తాజా వీడియోలు

Back to Top