సంక్షేమానికి చెదలు

ఏపీలో సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు హయాంలో
బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను పట్టించుకునే నాథుడే
కరువయ్యాడు. సిబ్బంది ఏటా పదవీ విరమణ చేస్తున్నా కొత్తవారిని నియమించకుండా..
సర్కారు కాలయాపన చేస్తోంది.

ముఖ్యంగా ఇందిరాగాంధీ హయంలో సంక్షేమ రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వేల
సంఖ్యలో హాస్టళ్లను ఏర్పాటు చేసుకొన్నారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో హాస్టళ్లు
ఏర్పాటు చేయటంతో అందులో పనిచేసేందుకు అదే ఒరవడితో అధిక సంఖ్యలో ఉద్యోగుల్ని
చేర్చుకొన్నారు. అప్పుడు విధుల్లో చేరిన వారంతా ఇప్పుడు దఫ దఫాలుగా రిటైర్
అవుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున సంక్షేమ హాస్టళ్లలో ఖాళీలు ఏర్పడుతున్నాయి.

ప్రతి హాస్టల్ కు వార్డెన్, వర్కర్, ఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండాలి. కానీ 90 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నా అధికారులు
పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కొత్త ఉద్యోగాల ఊసే ఎత్తకపోవడంతో.. ఉన్నవాళ్లకే
అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు.  ఒక
వార్డెన్ లేదా వెల్ఫేర్ అధికారికి అదనంగా రెండు, మూడు హాస్టళ్ల బాద్యతలు
అప్పగించేస్తున్నారు. దీంతో అధికారులు ఏ ఒక్కదాని మీద శ్రద్ధ చూపించలేక
పోతున్నారు.  

హాస్టళ్లో పిల్లలకు ఆరోగ్య
సమస్యలున్నాయా, ఫీజు రీయింబర్స్
మెంట్ వస్తోందా లేదా. స్కాలర్ షిప్పుల సంగతేంటి.. అని పట్టించుకునే వారే
కరువయ్యారు. కాంట్రాక్టు వర్కర్లు కావడంతో వచ్చామా, వెళ్లామా అన్నట్లుగా పనిచేస్తున్నారు. వీరిపై
పర్యవేక్షణ కొరవడటంతో. విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ సమయంలో హైస్కూల్స్ లో
చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో పడిపోయింది. 

Back to Top