స్మార్టు సిటీల్లోనూ టీడీపీ నిర్ల‌క్ష్యం..!

స్మార్టు సిటీల కేటాయింపులోనూ అన్యాయ‌మే
ప‌ట్టించుకోని టీడీపీ
అంద‌ని ద్రాక్ష సామెత‌

హైద‌రాబాద్‌: కేంద్ర ప్ర‌భుత్వ విధాన ప్ర‌క‌ట‌న‌లో మ‌రోసారి రాష్ట్రానికి అన్యాయం ఎదురైంది. స్మార్ట్ సిటీల ప్ర‌క‌ట‌న‌లో మూడంటే మూడు న‌గ‌రాల‌కు చోటు ద‌క్కింది. 12 రాజ‌ధాని న‌గ‌రాల‌తో సహా 98 న‌గ‌రాల‌కు ఇందులో చోటు క‌లిపించారు. కానీ రాష్ట్రం నుంచి స‌రైన ఒత్తిడి లేక‌పోవటంతో మూడింటితో స‌రిపెట్టారు.

అన్యాయం జ‌రిగిందిలా..!
స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్ర ప్ర‌భుత్వాల చొర‌వ క‌నిపించింది. స్మార్ట్ సిటీల కోసం అభ్య‌ర్థ‌న పెట్టుకొన్న నాటి నుంచి సంబంధిత డాటా అందించ‌టం దాకా ఆయా ప్ర‌భుత్వాల శ్రద్ధ అవ‌స‌రం. అందుకే చుట్టుప‌క్క‌ల రాష్ట్రాలు అధికంగా స్మార్టు సిటీల‌ను ద‌క్కించుకొన్నాయి. క‌ర్నాట‌క కు 6, మ‌హారాష్ట్ర  కు 10, త‌మిళ‌నాడు కి 12 ద‌క్కాయి. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మొద‌ట నుంచీ కేంద్ర ప‌థ‌కాలు, వాటికి అనుగుణంగా వివ‌రాల్ని అందిస్తూ వ‌చ్చాయి. దీంతో ప‌ని తేలిక అయింది.

ప‌ట్టించుకోని టీడీపీ
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి తెలుగుదేశం ఎప్పుడూ ప‌ట్టించుకోవ‌టం లేదు. ఓటుకి కోట్లు కుంభ‌కోణం కేసు మీద ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దృష్టి పెడితే, ప్యాకేజీల గురించి మంత్రులు శ్ర‌ద్ధ చూపించారు. ఫ‌లితంగా కేంద్రానికి అవ‌స‌ర‌మైన డాక్యుమెంటేష‌న్‌, చొర‌వ క‌ర‌వైంది. ఫ‌లితంగా స్మార్ట్ సిటీల కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి మిగిలింది.

అంద‌ని ద్రాక్ష సామెత‌
ప్ర‌త్యేక హోదా గురించి ప‌ట్టించుకోకుండా ప్యాకేజీల మీద దృష్టి పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు కూడా అదే పోక‌డ అవ‌లంబిస్తోంది. దీంతో రాష్ట్రానికి స‌రైన న్యాయం జ‌ర‌గ‌టం లేదు. ఇప్పుడు స్మార్ట్ సిటీల గురించి కూడా అలాగే వ‌దిలేసిన రాష్ట్ర స‌ర్కారు పైకి మాత్రం పెద‌వి విరుస్తోంది. 
Back to Top