కోర్టుల‌తోనూ రెండు నాలుక‌ల చెల‌గాటం..!


హైద‌రాబాద్‌) ఒక మ‌హిళా ఎమ్మెల్యేను వేధించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం లోని అన్ని శ‌క్తులు ఏకం అవుతున్నాయి. శాస‌న‌, కార్య‌నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల్లోని అన్ని యంత్రాంగాలు, మంత్రాంగాలు ఏక‌మై ప‌నిచే్స్తున్నాయి. మంత్రి వ‌ర్గ స‌మావేశంలోనూ ఇవే స‌మాలోచ‌న‌లు, ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల్లో మెజార్టీ వ‌ర్గాల‌తో మేధో మ‌థ‌నం.. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఎమ్మెల్యే రోజా మీద క‌క్ష సాధింపు కోసం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రెండు రోజులుగా పాల‌న్ని గాలికి వ‌దిలేసింది. మ‌రో రెండు రోజులూ అదే ప‌ని చేయ‌నుంది.
వాస్త‌వానికి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం లోని పెద్ద‌ల‌కు తాము త‌ప్పు చేశామ‌న్న సంగ‌తి స్ప‌ష్టంగా అర్థం అయింది. అహంకారంతో, త‌ల పొగ‌రుతో చేసిన ప‌ని ఇంత‌టి చేటు తెస్తుంద‌ని ఊహించ లేక‌పోయారు. అక్క‌డే శాస‌న‌స‌భ లో ప్ర‌తిప‌క్ష నేత వై ఎస్ జ‌గ‌న్ మాట్లాడుతూ రూల్ 340 ప్ర‌కారం ఒక సెష‌న్ క‌న్నా మించి స‌స్పెండ్ చేసే అధికారం లేద‌ని హిత‌వు ప‌లికారు. ధోర‌ణి మార్చుకోవాల‌ని సూచించారు. అయినా, అహంకారంతో ఉన్న ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు ఇవేమీ త‌లకు ఎక్క లేదు.
పరువు ప్రతిష్ట కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం దానినుంచి బయటపడటానికి రకరకాల ప్రయత్నాలను ప్రారంభించింది. హైకోర్టు ఆదేశాలను గురువారం రోజునే స్వయంగా రోజా తీసుకొచ్చి శాసనసభ కార్యదర్శికి అందించారు. దానిపై ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆ తీర్పుపై అప్పీలు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ తీర్పు ప్రతిని అందించిన తర్వాత శుక్రవారం తాను శాసనసభ సమావేశాలకు హాజరవుతానని కూడా రోజా అక్కడే ప్రకటించారు. మ‌హిళా స‌భ్యురాలిని వేధించాల‌నే నిర్ణయానికే ప్ర‌భుత్వ పెద్ద‌లు మొగ్గు చూపారు.
పోనీ, ఇప్పుడు హైకోర్టు సున్నితంగా అక్షింత‌లు వేసినా ప‌చ్చ గ్యాంగ్ లో పరివ‌ర్త‌న క‌లగ లేదు. దీంతో శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల ముఖ్య‌కార్య‌ద‌ర్శితో డివిజ‌న్ బెంచ్ లో పిటీష‌న్ వేశారు. అంటే శాస‌న‌స‌భ సుప్రీం అని వాదిస్తున్నారు కాబ‌ట్టి స‌భ త‌రపున స్పీక‌ర్ కానీ, శాస‌న‌స‌భ కార్య‌ద‌ర్శి కానీ పిటీష‌న్ వేయటం లేదు. అంటే డివిజ‌న్ బెంచ్ లో అనుకూలంగా ఆదేశాలు వ‌స్తే వాటిని అమ‌లుచేస్తారు. లేదంటే స‌భ సుప్రీం అంటున్నారు కాబ‌ట్టి అదే వాదన‌తో కొన‌సాగిస్తారు. రెండు నాల‌క‌ల‌తో రాష్ట్రాన్ని నిలువుగా కోయ‌ట‌మే కాదు, అవ‌స‌రం అయితే న్యాయ‌స్థానాల్ని సైతం మ‌భ్య పెట్ట‌గ‌ల‌ర‌ని రుజువు చేశారు. 

Back to Top