వైయస్ జగన్‌ పాదయాత్రపై టీడీపీ కుట్ర

-పాదయాత్రలో అలజడి సృష్టించేందుకు పన్నాగం
– టీడీపీ నాయకులకు చంద్రబాబు దిశానిర్దేశం
– గత అనుభవాల దృష్ట్యా కార్యకర్తల్లో అనుమానాలు

వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైస్‌ జగన్‌ పాదయాత్రను అడ్డుకునేందుకు సీఎం అధ్యక్షతన వ్యూహాలు సిద్ధమవుతున్నట్టుగా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాపు ఉద్యమం నేపథ్యంలో జరిగిన తుని సంఘటనను వైయస్‌ జగన్‌ పాదయాత్రకు ముడిపెట్టి కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేయాలన్న కుట్రలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా శాంతి భద్రతల సమస్యలు ఏమైనా తలెత్తే ప్రమాదం ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పోలీసులను అప్రమత్తం చేస్తారు. అయితే చంద్రబాబు మాత్రం టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. జగన్‌ పాదయాత్రపై ఎదురుదాడి చేయాలని సంకేతాలు ఇవ్వడం పట్ల ప్రజలు, ప్రజాసంఘాలు, పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. 
 
తుని సంఘటనకు వైయస్‌ఆర్‌సీపీ నాయకులను బాధ్యులను చేస్తూ విచారణ పేరుతో వేధింపులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లేకపోయినా పార్టీ సీనియర్‌ నాయకుడు భూమన కరుణాకర్‌రెడ్డిని బాధ్యుడిని చేస్తూ విచారణకు పిలిచి వేధించారు. 

క్యాండిల్‌ ర్యాలీకి వెళ్లినా..
జల్లికట్టు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం యువత విశాఖలో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహిస్తుంటే మద్ధతు పలకాల్సింది పోయి.. ర్యాలీకి వస్తున్న ప్రతిపక్ష నాయకుడిని విశాఖ విమానాశ్రయంలో అడ్డగించి శాంతి భద్రతలంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారు.

ఇప్పుడు పాదయాత్రపైనా అంతే...
పార్టీ ప్లీనరీ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ అధినేత పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన మరుక్షణమే టీడీపీ శిబిరంలో కలకలం మొదలైంది. ఆరు నెలలపాటు సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టడంతో ఎలాగైనా అడ్డుకోవాలని కుటిల పన్నాగాలు పన్నుతున్నారు.  వైయస్‌ జగన్‌ పాదయాత్ర నేపథ్యంలోనే 600 మందితో లోకేష్‌ ప్రత్యేక ఆర్మీని సిద్ధం చేయడం అనుమానాలకు తావిస్తోంది. 
Back to Top