పుష్కరాల దోపిడీ కి మరో ఎత్తుగడ

() ముందుగానే జాగ్రత్త పడిన తెలుగుదేశం

() గోదావరి పుష్కరాల అనుభవంతో ముందస్తు ప్రణాళిక

() స్పెషల్ ఆఫీసర్ల నియామకంలో కోటరీ కే బాధ్యత

హైదరాబాద్) ప్రభుత్వ సొమ్మును ఎలా దోచుకోవాలో
తెలుగుదేశం నాయకులకు కొత్తగా ఎవరూ నేర్పించనవసరం లేదు. అందిన కాడికి దోచుకొనేందుకు
కొత్త టెక్నిక్ లు అమలు చేస్తుంటారు. గోదావరి పుష్కరాల్లో దోపిడీ కి ఇబ్బంది
కలిగించిన అంశాల్ని తెర మీదకు రానీయకుండా జాగ్రత్త పడుతున్నారు.

గోదావరి పుష్కరాల్లో ఇబ్బంది

      పుష్కరాలు అంటే హిందూ మతానికి
సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం. అందుకే గోదావరి పుష్కరాలకు ముందుగా పనులన్నీ
దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్ ను
నియమించారు. అయితే పుష్కరాల పేరుతో కోట్లు కొట్టేసేందుకు ప్రయత్నించిన తెలుగు
తమ్ముళ్లకు పనులు సక్రమంగా జరగలేదు. దీంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు.
అకస్మాత్తుగా దేవాదాయ శాఖ, ఆ శాఖ మంత్రి  పక్కకు తప్పుకోవటం జరిగింది. పురపాలక శాఖ
మంత్రి, చంద్రబాబు నాయుడు సన్నిహితుడు నారాయణ కు బాధ్యతలు అప్పగించారు. దీంతో
తెలుగు తమ్ముళ్లకు మార్గం సుగమం అయింది. వందల కోట్ల రూపాయిలు గోల్ మాల్ జరిగిందని
ఆరోపణలు వెల్లువెత్తాయి. మిత్రపక్షమైన బీజేపీ సభ్యులే గోదావరి పుష్కరాల పనుల్లో అవినీతి
పడగ విప్పిందని ఆరోపించారు.

ముందస్తు జాగ్రత్త

ఈ ఏడాది క్రిష్నా పుష్కరాలు వస్తున్నాయి. గతంలో మాదిరిగా దేవాదాయ శాఖ
ఆధ్వర్యంలో పనులు మొదలైతే ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వ పెద్దలు తలపోశారు.
రాజధాని ప్రాంతంలో భూముల్ని అడ్డగోలుగా లాక్కోవటంలో కీలక పాత్ర పోషించిన వ్యవసాయ
మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు, మునిసిపల్
శాఖ మంత్రి నారాయణ లకే బాధ్యత అప్పగిస్తున్నట్లు సమాచారం. ఇందుకు తగినట్లుగానే
స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవసాయ శాఖ డైరక్టర్ ధనుంజయ్ రెడ్డి, మునిసిపల్ శాఖ ఢైరక్టర్
కే కన్నబాబులకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ అధికారులు పూర్తిగా టీడీపీ తొత్తులు
అని చెప్పటం ఉద్దేశ్యం కాదు కానీ, సంబంధిత శాఖల డైరక్టర్ లుగా నేరుగా ఆయా మంత్రుల
చేతికింద పనిచేసే ఉద్యోగులుగా ఉంటారు. అటువంటప్పుడు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి
పుల్లారావు, మునిసిపల్ మంత్రి నారాయణ మరోసారి చక్రం తిప్పే అవకాశాలు
కనిపిస్తున్నాయి.

దోపిడీకి పోటీ

పుష్కరాల పనుల కోసం తెలుగుదేశం నాయకుల్లో విపరీతమైన పోటీ నెలకొంది. అడ్డగోలుగా
డబ్బులు దోచుకొనేందుకు ఇప్పటికే ముందస్తు ప్రయత్నాలు మొదలయ్యాయి. అందుకే విజయవాడ
కేంద్రంగా పుష్కరాల పనులు జరుగుతాయి కాబట్టి దీనికి తగినట్లుగా ప్రణాళికలు
రచించుకొంటున్నారు. 

Back to Top