అందరి అడుగులూ.. షర్మిల చెంతకే!

సబ్బవరం (విశాఖ జిల్లా) :

జగనన్న వదిలిన బాణానికి విపరీతమైన జనాదరణ లభిస్తోంది. ఆమె నడిచి వస్తున్న ప్రతి చోటా వైయస్‌ అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానికులు పెద్ద ఎత్తున ఎదురేగి స్వాగతం చెబుతున్నారు. శ్రీమతి షర్మిల చెప్పే ప్రతి మాటకూ జనం నుంచి విశేష స్పందన వస్తోంది. స్థానికుల సమస్యలను సావధానంగా వింటున్న శ్రీమతి షర్మిల వారికి హామీలిస్తూ, భరోసా కల్పిస్తూ ముందు సాగిపోతున్నారు. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉంటున్న స్థానిక సమస్యలను శ్రీమతి షర్మిల ప్రస్తావిస్తున్న తీరు, కాంగ్రెస్‌, టిడిపి నాయకులు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న వైనం ప్రజల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగుతూ రక్షణ కవచంలా నిలుస్తున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిలకు జనసంద్రం స్వాగతం పలికింది. నియోజకవర్గం సరిహద్దు అయ్యన్నపాలెం వద్ద నియోజకవర్గం సమన్వయకర్త గండి బాబ్జీ నేతృత్వంలో పెద్ద ఎత్తున జనం ఆమెను స్వాగతించారు. గుర్రాలు, గంగిరెద్దులు, కళా బృందాల సాదర స్వాగతం మధ్య శ్రీమతి షర్మిల నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. గుల్లేపల్లి, పెదనాయుడుపాలెం మీదుగా సబ్బవరం, అసకపల్లి, పైడివాడల్లో జనం రోడ్డు మీద నిలబడి శ్రీమతి షర్మిల కోసం ఎదురు చూశారు. పింఛన్లు రావడం లేదనీ, తాగునీరు లేవనీ, ఉపాధి హామీ పథకం పనుల్లో కూలి గిట్టుబాటు కావడం లేదనీ ఇలా అనేక సమస్యలను శ్రీమతి షర్మిల దృష్టికి జనం తీసుకువచ్చా రు.

స్థానికుల సమస్యలను శ్రీమతి సర్మిల సావధానంగా విన్నారు. భయం వద్దనీ, త్వరలో మంచి రోజులు వస్తాయని వారికి ధైర్యం చెప్పారు. సబ్బవరం సరిహద్దుకు చేరుకున్న శ్రీమతి షర్మిల బృందానికి వేలాది మంది జనం ఎదురేగి నీరాజనం పట్టారు. ప్రధాన వీధులన్నీ జనంతో నిండిపోయాయి. మహిళలు, యువకులు, వృద్ధులు కూడా శ్రీమతి షర్మిల పాదయాత్రలో అడుగు వేస్తూ ఆమె వెన్నంటే ముందుకు సాగారు. సబ్బవరం సర్కిల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి వేలాది మంది ప్రజలు ఆమె కోసం ఎదురు చూశారు. సాయంత్రం 6 గంటలకు శ్రీమతి షర్మిల దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ ‌రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి సభను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి శ్రీమతి షర్మిల వివరించినప్పుడల్లా జనం పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. చంద్రబాబు నాయుడు, సి.ఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీల మీద ఆమె ఎక్కుపెట్టిన విమర్శల బాణాలకు హర్షాతికేరాలు వ్యక్తమయ్యాయి. సుమారు 45 నిముషాల పాటు సాగిన ఆమె ప్రసంగాన్ని జనం ఓపిగ్గా విన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద కాంగ్రెస్, ‌టిడిపి కుమ్మక్కుతో పెట్టిన అక్రమ కేసుల గురించి ప్రస్తావించినప్పుడు జనం పెద్ద ఎత్తున స్పందించారు. ‘సింహం బోనులా ఉన్నా సింహమే’ అన్న వెంటనే జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ‌చేశారు.

నాన్న ఉంటే సుజల స్రవంతి ఎప్పుడో పూర్తయ్యేది :
‘ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని 12 లక్షల ఎకరాల బీడు భూముల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వైయస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సుజల స్రవంతి ప్రాజెక్టు ఆయ‌న ఉంటే ఈ పాటికి పూర్తయ్యేదని శ్రీమతి షర్మిల చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మించి రైతులను ఆదుకోవాలనేది దివంగత మహానేత స్వప్నం అన్నారు. ఆయన మరణంతో ఈ రెండు ప్రాజెక్టులకు అతీగతీ లేకుండా పోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. 2009 ఫిబ్రవరిలో సుజల స్రవంతి ప్రాజెక్టుకు వైయస్ శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 7 వేల కోట్ల రూపాయల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు అవసరం లేదనీ, ఆయన మరణం తర్వాత ప్రస్తుత ప్రభుత్వం సుజల స్రవంతి ప్రాజెక్టును రద్దు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.

భూదేవి చెరువు పరిశీలించిన షర్మిల :

‘మిగులు జలాలను ఉపయోగించాలని మహానేత డాక్టర్‌ వైయస్ కలలు కన్నార‌ని, సుజల స్రవంతి ప్రాజెక్టు పేరిట ఈ ప్రాంతంలో రిజర్వాయరు కట్టించాలనుకున్నారని, ఆయన కల కలగానే మిగిలిపోయింది..’ అని భూదేవి చెరువు సమీప ప్రాంత రైతులు వాపోయారు. గండి బాబ్జీ ఆధ్వర్యంలో స్థానిక రైతులు భూదేవి చెరువును శ్రీమతి షర్మిలకు చూపించారు. ‘భీమిలి వరకు నీరు వెళ్ళేలా సుమారు 80వేల ఎకరాలు సస్యశ్యామలం చేద్దామని పెద్దాయన భావించారని, ఆయన మరణానంతరం తమ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని దొగ్గ దేముడు అనే వ్యక్తి చెప్పారు. ‘2009 ఫిబ్రవరిలో ఏలేరు కాలువ నుంచి కృష్ణా మిగులు జలాల్ని శ్రీకాకుళం వరకు తరలించడం ద్వారా 1200 గ్రామాలకు లబ్ధి కలిగేలా వైయస్ పనులు చేపట్టారని నీటి సంఘం అధ్యక్షుడు తుంపాల కోటేశ్వరరావు వివరించారు.

ఆకట్టుకున్న గంగిరెడ్ల సంఘం స్వాగతం :
శ్రీమతి షర్మిల పెందుర్తి నియోజకవర్గంలో అడుగు మోపిన శుభవేళలో.. వేపగుంట గంగిరెడ్ల సంఘం స్వాగత కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకర్షించింది. మరో ప్రజాప్రస్థానం మంగళవారం ఉదయం పెందుర్తి నియోజకవర్గంలో గుల్లేపల్లికి చేరుకునే సమయానికి గంగిరెడ్ల వారు కలిసి స్వాగతించారు. గంగిరెద్దు, డోలు, సన్నాయిలతో సందడి చేశారు. గంగిరెడ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, 69వ వార్డు బీసీ సెల్ కన్వీన‌ర్ ఆవాల గొల్లయ్యతో శ్రీమతి షర్మిల మాట్లాడారు. సంస్కృతి పరిరక్షణే జీవనోపాధిగా ఉన్న తమను ఎస్సీలుగా పరిగణిస్తే మేలవుతుందని వారు తెలిపారు. జగనన్న వచ్చాక వారికి తప్పక న్యాయం జరుగుతుందని శ్రీమతి షర్మిల ధైర్యం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top