చంద్రబాబు మాటల గారడీ..!

అన్నీ తానే చేశానంటూ గొప్పలు..
వైఎస్సార్ హయాంలోనే తోటపల్లికి భారీ నిధులు..!

హైదరాబాద్: ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పనులను తమవిగా చెప్పుకునేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎన్నో ప్రాజెక్ట్ లను చేపట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేశారు. కానీ, ఇప్పుడొచ్చిన చంద్రబాబు పనులు ప్రారంభించకుండానే ప్రాజెక్ట్ లను జాతికి అంకితం చేస్తూ ఢంకా బజాయించుకుంటున్నారు.  

మోసపూరిత ప్రకటనలు..!
తోటపల్లి ప్రాజెక్ట్ కు వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే రూ. 400కోట్లు కేటాయించారు. చంద్రబాబు కేవలం రూ.55 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేసి ప్రాజెక్ట్ ను తానే ప్రారంభించానంటూ, జాతికి అంకితం చేయడం దురదృష్టకరం. ప్రాజెక్ట్ కు తమ తండ్రి గౌతు లచ్చన్న పేరు పెట్టడం హర్షదాయకమని సోంపేట ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీ అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీ  సాకారమైందన్నారు. ఈప్రాజెక్ట్ వల్ల విజయనగరం జిల్లాలో 10 మండలాలకు ..శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలకు నీరు అందుతుంది. 

భూముల కోసం నాటకం..!
ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం పేరుతో విజయనగరం జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి పెద్ద ప్లానే వేశారు. భోగాపురం విమానాశ్రయానికి భూములివ్వాలంటూ రైతుల పొట్టగొట్టే ప్రయత్నానికి పదును పెట్టారు.  రాష్ట్రంలో భూసేకరణ అవసరమందని, ఎయిర్ పోర్టుకు భూములివ్వాలని  రైతులను కోరిన చంద్రబాబు... విపక్షాల మాటలు నమ్మవద్దంటూ నూరిపోశారు. కరువుకు కవల సోదరుడు అయిన చంద్రబాబు...రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామంటూ చెప్పడం హాస్యాస్పదం.  
Back to Top