రైతు గుండె దడ దడ

ఖరీఫ్ ను తలచుకొంటేనే గుండె గుబులు
వానలు పడితే నారుమడులకు రంగం సిద్ధం
ఇప్పటికే కొన్ని చోట్ల సీజన్ ప్రారంభం
తల పట్టుకొంటున్న రైతన్న
 
హైదరాబాద్: వేసవిలో ఎప్పుడు వానలు పడతాయా..వ్యవసాయం పనులు మొదలు పెట్టాలా అని రైతులు ఎదురు చూస్తుండే వారు. మే నెల చివర్లో ఏ ప్రాంతంలో కాస్తంత చినుకులు పడినా, నారుమడులు వేయటం మొదలెట్టేవారు. పొలాల్ని దుక్కి దున్ని నారుమడులు సిద్దం చేసుకోవటం, విత్తనాలు పోసుకోవటం చకా చకా జరిగేవి. ఈ లోగా బ్యాంకులకు వెళ్లి పంట రుణాలకు రదఖాస్తు చేసుకోవటం మొదలెట్టేవారు. 
ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు రైతులకు జూన్ నెలను తలచుకొంటేనే భయం మొదలవుతోంది. వ్యవసాయం పనులు మొదలు పెట్టాలంటే పెట్టుబడులు కావాలి. చంద్రబాబు మాయ మాటలు నమ్మి, రైతులు పంట రుణాలు కట్టలేదు. దీంతో వడ్డీల మీద వడ్డీలు పడిపోయాయి. అప్పటికీ రుణ మాఫీ చేసేదీ లేనిదీ తేల్చి చెప్పలేదు. దీంతో నిర్దిష్ట వ్యవధి దాటిపోవటంతో అపరాధ రుసుంలు మొదలయ్యాయి. దీంతో తడిసి మోపెడయింది. రబీ సీజన్ కు తాత్కాలికంగా ప్రైవేటు వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రైతులు అప్పులు తెచ్చుకొన్నారు. ఆ సీజన్ పూర్తయ్యేసరికి బ్యాంకుల నుంచి రుణ మాఫీ జరిగిపోయి, అంతా సర్దుకొంటుందని భావించారు. కానీ, చంద్రబాబు అదే గారడీ కొనసాగించటంతో రైతులు నిండా మునిగారు. దీంతో అటు బ్యాంకుల నుంచి ఉపశమనం దొరక్క , ప్రైవేటు అప్పులు పేరుకొని పోయాయి. ఇప్పుడు ప్రైవేటు వ్యాపారుల జోలికి పోకుండా బ్యాంకుల్నే  ఎక్కువగా తిరిగి ఆశ్రయిస్తున్నారు.
 
వడ్డీ పోటు
ఇప్పటికే పీకల లోతు మునిగిన రైతులకు బ కాయిలు క న్నీరు తెప్పిస్తున్నాయి. పాతబకాయిలు క డితేనే తిరిగి అప్పులు ఇస్తామని కొన్ని చోట్ల తెగేసి చెబుతున్నారు. దీంతో ఇబ్బందులు తప్పటం లేదు. కనీసం వడ్డీ కట్టినా పరిగణనలోకి తీసుకొని అప్పులు ఇప్పించాలని వేడుకొంటున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది సాధ్యం అయినా, చాలా చోట్ల కుదరటం లేదు. దీంతో రైతులకు ఆందోళన తప్పటం లేదు.
 
అర కొర అప్పులు
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు అధికారులకు, రైతులకు సుహృద్భావ సంబంధాలు ఉంటాయి. దీంతో   నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ అప్పులు ఇవ్వటం జరిగిపోయేది. అంటే ఆయా పంటల్ని బట్టి, ఆయా భూముల్లో ఎంత మేర అప్పులు ఇవ్వవచ్చో నిబంధనల్ని రూపొందిస్తారు. అంటే మెట్ట భూముల్లో ఒక లా, జరీబు లేక పల్లపు భూముల్లో ఒకలా ఈ మొత్తం ఉంటుంది. అలాగే వరి, అరటి, చెరకు ఇతర ఉద్యాన పంటలకు ఈ మొత్తం మారుతూ ఉంటుంది. అయినా సరే, రైతులకు ఉండే ఖర్చుల్ని దృష్టిలో పెట్టుకొని చాలా చోట్ల బ్యాంకు అధికారులు ఉదారంగా వ్యవహరించి అప్పులు ఇచ్చేవారు. కానీ, చంద్రబాబు అధికారంలోకి వ చ్చాక రుణమాఫీ చేయకుండా రైతుల్ని మోసం చేయటమే కాకుండా ఎక్కువ అప్పులు ఇవ్వకుండా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. ప్రభుత్వం నుంచి రైతులకు సానుకూలంగా ఒత్తిడి తేవటం అటు ఉంచి, ఈ విధంగా రైతులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవటంతో బ్యాంకర్లు మిన్నకుండి పోయారు. దీంతో నిబంధనల మేరకే అప్పులు ఇస్తామని తెగేసి చెబుతున్నారు. 
 
కొత్త అప్పుకు షరతులు
గతంలో బ్యాంకు పాస్ బుక్ ల ఆధారంగా అప్పుల్ని ఇచ్చేసేవారు. ఇప్పుడు రుణమాఫీ మీద అస్పష్టత ఉండటంతో కొత్త అప్పులకు సవాలాక్ష నిబంధనలు పెడుతున్నారు. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి పత్రాల్ని కచ్చితంగా తెమ్మని అడుగుతున్నారు. పాత బకాయిలకు సంబంధించిన వివరాల్ని అడుగుతున్నారు. సాధారణంగా రైతులు 2,3 బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొంటుంటారు. ఇప్పుడు ఆ వివరాల్ని అడుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. తేలిగ్గా రుణాలు ఇచ్చే పరిస్థితి లేకపోవటంతో రైతులు తిరిగి ప్రైవేటు వ్యాపారుల వైపు అడుగులు వేస్తున్నారు. 
 
రుణమాఫీ మీద అదే అస్పష్టత
రుణమాఫీ విషయంలో ఎప్పటికీ స్పష్టత వచ్చే అవకాశం కన్పించటం లేదు. ఇప్పటికే రెండు విడతల రుణమాఫీ జరిగిపోయినా లబ్దిదారులకు ఏ ప్రాతిపదికన రుణమాఫీ అవుతోంది, ఏ ప్రాతిపదికన తిరస్కరిస్తున్నారు అనేది తేలీటం లేదు. ఒక వేళ రుణమాఫీ అయినప్పటికీ, ఎంత మొత్తంలో ఇది జరుగుతోందో తెలీటం లేదు. దీని మీద ఫిర్యాదు చేయమంటే హైదరాబాద్ కు, జిల్లా రాజధానులకు ప్రదక్షిణలు చేసినా ప్రయోజనం కలగ లేదు. ఇప్పటికీ అదే అస్పష్టత ఉంది తప్పితే కనీసం ఈ ఫిర్యాదుల మీద చర్యలు కూడా మొదలు కాలేదు. 

తాజా వీడియోలు

Back to Top