ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై నాలుగున్నరేళ్ల పాటు నిద్ర నటించిన చంద్రబాబు నాయుడు గారికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు రోజురోజు డ్రామాతో ముందుకు వస్తున్నారు. అటువంటి కోవలోనే కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన ను కూడా నిస్సందేహంగా చేర్చవచ్చు.
ఫ్యాక్టరీకి సంబంధించిన ఎటువంటి ప్రాథమికమైన కార్యక్రమాలన్నీ పూర్తి కాకుండానే ఆదరాబాదరాగా శంకుస్థాపన చేయడంలోని మతలబు0ఏమిటో కళ్లకు కట్టినట్లుగా అందరికీ అర్ధమవుతోంది. ఏదైనా ప్రభుత్వ పరంగా కార్యక్రమం చేపట్టేటప్పుడు,దానికి సంబంధించిన కొన్ని అంశాలపై స్పష్టమైన నిర్ణయాలను వెలువరించాలన్న కనీసపు ఆలోచన కూడా మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేతకు రాకపోవడం విచారకరం. ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటును ఎవరూ వ్యతిరేకించకున్నా, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడంలో శ్రద్ధ చూపుతూ తూతూ మంత్రంగా , ఏదో చేశామనే ప్రచారం చేసుకోడానికే పునాది రాళ్లను వేయడాన్ని ఎవరూ హర్షించరు.

కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఈకింది అంశాలను ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడిపై ఉంది. ఉక్కు పరిశ్రమపై సామాన్య ప్రజానీకంలో ఉన్న సందేహాలివి:

1. ఈప్లాంటులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పెట్టుబడి ఎంత దానిని ఎలా సమీకరిస్తారు?

2.  ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తామంటున్న ఈ ప్లాంట్ భాగస్వామ్యులెవరు?

3. వారు పెట్టే మూలధనం ఎంత? ఇందుకు సంబంధించిన ఎంఒయు కుదిరిందా?

4.  ఉత్పత్తికి అవసరమైన ముడి ఖనిజాన్ని ఎలా సేకరిస్తారు?

5. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు, ఏమీ లేకుండా స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన ఎలా చేస్తారు?

6.  విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం పై ఎందుకు వేసుకుంటున్నారు?

ఇలా చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనాలేమిటి?

ఇలా కీలకమైన అనేక అంశాలను పక్కకు బెట్టి హడావుడి చేస్తున్న ఈ ప్లాంట్ అనేది ఉత్తుత్తి ఫాక్టరీగా...చంద్రబాబు జమానాలో మరో పునాది రాయిగానే మిగిలిపోతుందనడంఅతిశయోక్తి కాదు.