ప్రత్యేకహోదాపై ప్రభుత్వాల అలసత్వం..!

ప్యాకేజీ పేరుతో కొత్త నాటకం..!
కేంద్ర నిధులనే ప్యాకేజీ రూపంలో మలిచే ఎత్తుగడ..!

రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యపు ధోరణితో ఆంధ్రప్రదేశ్ అంధకారమైపోయింది. ఇప్పటికే విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరగ్గా...విభజన చట్టంలో హామీలు నెరవేరక రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేకహోదా సహా అనేక హామీలు ఇచ్చారు. కానీ టీడీపీ ప్రభుత్వం అలసత్వం కారణంగా అవీ ఏవీ నెరవేరడం లేదు. వైఎస్సార్సీపీ ఆందోళనలు,  ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవ్వడంతో  అప్రమత్తమయిన చంద్రబాబు మరోకుట్రకు పావులు కదుపుతున్నారు.  

ప్రజల దృష్టి మరల్చే కుట్ర..!
ప్రత్యేకహోదా నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు మరో ఎత్తుగడకు తెరదీస్తున్నాయి. ఏడాదిన్నర కిందట ఇచ్చిన హామీలన్నీ లెక్కగట్టి ప్యాకేజీ కింద ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని హామీల అమలుకు దాదాపు రూ.లక్షా 50 వేల కోట్లు అవసరమవుతుందని అంచనా. ఇవేగాక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆయా పథకాల కింద ఐదేళ్ల కాలంలో సుమారు రూ. 2 లక్షల వరకు రావాల్సి ఉంటుంది. ఐతే, వీటినే అటు తిప్పిఇటు తిప్పి  ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటన చేయించే పనిలో రాష్ట్రప్రభుత్వం ఉంది. 
రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సినవి...!
  • ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లోని పార్ట్ 10 సెక్షన్ 94,94(3) ప్రకారం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రానికి రావల్సిన నిధులు... 
  • 2014-2015 ఆర్థిక లోటు పూడ్చడం కోసం రూ.14,500 కోట్లు 
  • రాజధాని నిర్మాణం కోసం రూ.15,175 కోట్లు
  • పోలవరం ప్రాజెక్ట్ కోసం రూ.20,010 కోట్లు 
  • వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ కింద ఏటా జిల్లాకు రూ.200 కోట్లు (ఐదేళ్లలో రూ.7,000 కోట్లు)
  • జాతీయ స్థాయి విద్యాసంస్థల ఏర్పాటుకు రూ.9,580 కోట్లు
  • పరిశోధన,శిక్షణా సంస్థల ఏర్పాటుకు రూ.8,000 కోట్లు
  • పోర్టులు, మెట్రోరైల్, స్టీల్ ఫ్యాక్టరీ, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఆర్థిక లోటు పూడ్చేందుకు రూ.46,600 కోట్లు 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రూ.32,809 కోట్లు 
  • 14వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు రూ.32,809 కోట్లు 
  • మొత్తం రూ. 1,53,674 కోట్లు ఇవ్వాల్సిందే. ఇవేగాకుండా ఆయా పథకాల కింద కేంద్రం నుంచి మరో రూ.45,000 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు కేంద్రం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కేంద్రం తలుచుకుంటే తక్షణమే వస్తుంది. కానీ చంద్రబాబు అసమర్థత వల్ల కేంద్రం పట్టించుకోకపోవడంతోనే రాష్ట్రానికి ఈగతి పట్టింది. 
Back to Top