సిక్కోలు లో ప్రాణాలతో చెలగాటంఇసుక మాపియా తో హడల్ప్రజల తరపున వైఎస్సార్‌సీపీ పోరాటం
శ్రీకాకుళం: తెలుగుదేశం నాయకుల అరాచకాలు శ్రీకాకుళంలో మితిమీరి పోతున్నాయి. డబ్బు కోసం ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. వంతెన పక్కనే ఇసుకను తవ్వేస్తూ కోట్లు గడిస్తున్నారు.
ప్రాణాలతో చెలగాటంశ్రీకాకుళం జిల్లాలో పాత పట్నం, కొత్త పట్నం లను కలుపుతూ నాగావళి నది మీద మరో వంతెనను నిర్మిస్తున్నారు. దీంతో గుజరాతిపేట, పీఎన్ కాలనీ వంటి అనేక కాలనీలు, 20కు పైగా గ్రామాలకు శ్రీకాకుళం మెయిన్ టౌన్ తో సంబంధం ఏర్పడుతుంది. కానీ, ఈ వంతెనకు స్తంభాలు నిర్మిస్తున్న చోటే ఇసుకను పెద్ద ఎత్తున తవ్వేస్తున్నారు. రోజుకి రూ. కోటి విలువ చేసే ఇసుకను తవ్వేసి తరలిస్తున్నారు.
భయపెడుతున్న ఇసుక మాఫియావంతెన కు దగ్గర గా ఇసుక తవ్వకాలు వద్దని స్థానికులు మొత్తుకొంటున్నారు. అయినప్పటికీ ఇసుక మాఫియా అధికార తెలుగుదేశానిది కావటంతో అక్రమాల్ని ప్రశ్నించే వారు కరవు అయ్యారు. అధికార యంత్రాంగం కూడా నిద్ర నటిస్తోంది. స్థంభాల పక్కనే ఇసుకను తవ్వేస్తే రేపు ప్రమాదం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రజల పక్షాన వైఎస్సార్సీపీమాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు నాయకత్వంలో వైఎస్సార్‌సీపీ ఇక్కడ పోరాటం చేస్తోంది. స్థానికులకు అండగా నిలిచి అధికారయంత్రాంగాన్ని కదిలించింది. దీని మీద విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటాన్నినిలిపివేస్తారా లేక ఇసుక మాఫియాకు భయపడి మిన్నకుండి పోతారా అన్నది తేలాల్సి ఉంది.