తెలుగుదేశం చరిత్ర ఇదిగో

తెలుగుదేశం నాయకుల జాతకాలు ప్రజలు అందరికీ తెలుసు. అధ్యక్షుడు చంద్రబాబు బాటలోనే తెలుగు తమ్ముళ్లు అందిన కాడికి దోచుకొంటున్నారు. ఈ విషయంలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా అంటే చాలా అభిమానం అని చంద్రబాబు చెబుతుంటారు. ఇక్కడ అన్ని ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెల్చుకొందని గొప్పలు చెబుతుంటారు. అందుకే తమను అడిగే వాడు లేడన్న ధీమాతో అక్కడ తెలుగు తమ్ముళ్లు చెలరేగుతున్నారు. అందిన కాడికి దోచుకొంటున్నారు.

ఈ విషయాల్ని స్వయానా పార్టీ ఎంపీ మాగంటి బాబు వెల్లడించారు. పోలవరం నియోజక వర్గం పర్యటనలో ఉండగా బాబు  ఈ విషయాలు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

‘‘ పోలవరం లో అవినీతి పెచ్చుమీరుతోంది. ప్రతి విషయంలో టీడీపీ నాయకులు దందాల వైఖరి అవలంభిస్తున్నారు. ఇసుక మాఫీయా నుంచి భూ తగాదాల వరకు కూడా సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. అర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో లక్షకు రూ.20 వేలు నియోజకవర్గ టీడీపీ నాయకులు రైతుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. ’’

స్థానిక ఎమ్మెల్యేను ఇరికించేందుకు చెప్పినప్పటికీ ఎంపీ బాబు ఉన్న విషయాల్నే చెప్పారని స్థానికులు చెప్పుకొంటున్నారు. కొంతకాలంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా ఇసుక తవ్వకాల పేరుతో అడ్డగోలుగా దోచేసుకొంటున్నారు. ఇదే జిల్లాకు చెందిన విప్ చింతమనేని ప్రభాకర్ పైశాచికత్వం రాష్ట్రం అంతా ఖ్యాతి పొందింది. ఇసుక మాఫియా ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మహిళా అధికారి మీద దాడి చేసి కొట్టించటమేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు చేతసెటిల్ మెంట్ చేయించారు. దీన్ని బట్టి ఇక్కడి దందాలు అర్థం అవుతున్నాయని స్థానికులు చెప్పుకొంటున్నారు.

Back to Top