పచ్చచొక్కాల పైశాచికం..!

అధికారమదంతో అరాచకాలు..!
రైతుల పంటలకు కొలిమి..!

రాజధాని ప్రాంతంలో చంద్రబాబు ఆకృత్యాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. పోలీసులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు ఆటవిక పాలన కొనసాగిస్తున్నాడు. భూదాహం, ధనదాహంతో చంద్రబాబు అండ్ కో రెచ్చిపోయి రైతులను హింసిస్తున్నారు. పోలీసులను ఉసిగొల్పి భూములు లాక్కునేందుకు అన్నదాతను క్షోభకు గురిచేస్తున్నారు. భూములివ్వని రైతులే టార్గెట్ గా ల్యాండ్ మాఫియాకు పాల్పడుతున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. 

పచ్చచొక్కాల వీరంగం..!
రైతులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ అధికారమదంతో విర్రవీగుతున్నారు.  ఆరుగాలం శ్రమించి పండించిన పంట కోతకు వచ్చిన వేళ...దగ్ధం చేసి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. పంటపొలాలు తగలబెడుతూ పచ్చచొక్కాలు కేపిటల్ ఏరియాలో భయానక వాతావరణం సృష్టిస్తున్నా ఖాకీలు కావరం ప్రదర్శిస్తున్నారు. కేసు పెట్టేందుకు వచ్చిన బాధితరైతులను వేధింపులకు గురిచేస్తూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ నాయకులే నిప్పు పెట్టారని  చెప్పాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటే...ఎంతగా దిగజారిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారో అర్థమవుతోంది.  

భూములివ్వని రైతులపై దౌర్జన్యం..!
పాసు పుస్తకాలు మార్చేస్తూ భూములు లాక్కుంటున్నా పట్టించుకోరు. మూడు పంటలు పండే పచ్చని భూములకు నిప్పంటించి బెదిరింపులకు దిగుతున్నా..కేసులు పెట్టరు, అరెస్ట్ లు చేయరు. చంద్రబాబు అధికారదాహంపై ప్రజలు భగ్గుమంటున్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేసి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని రైతన్నలు స్పష్టం చేస్తున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top