ఎల్లో ఎమ్మెల్యే బాగోతం

ఇసుక దందా నుంచి కాల్ మనీ దాకా
ఇల్లీగల్ వ్యాపారాలతో గలీజు పనులు
కోట్లకు పడగలెత్తిన బోడె ప్రసాద్

విజయవాడ: కాల్‌మనీ ముసుగులో విజయవాడలో మహిళల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న
మూఠాతో అధికారపార్టీకి చెందిన పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కు
సంబంధాలున్నాయని స్వయంగా బాధితులే చెబుతున్నా.... ఇప్పటివరకు ఆయనపై ఎలాంటి
కేసు నమోదు చేయకపోవడం దారుణం. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో బోడె ప్రసాద్,
ఎమ్మెల్సీ బుద్దావెంకన్నతో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఉండడంతో వారిని
తప్పించేందుకు చంద్రబాబు చాపకింద నీరులా పావులు కదుపుతున్నారు. విజయవాడలో
జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా అంటూ
చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఇందుకు బలం
చేకూరుస్తోంది. 

సెటిల్ మెంట్ లన్నీ అక్కడే
కాల్‌మనీ
వ్యాపారులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అండ ఉందని ఓ మహిళ పోలీస్ కమిషనర్‌కు
ఫిర్యాదు చేసింది. పటమటలోని కాల్‌మనీ ఆఫీస్‌కు బోడె తరచూ వెళుతుంటారని,
కొన్ని కేసులను ఆయన అక్కడే సెటిల్ చేశారని పలువురు బాధితులు  చెబుతున్నారు.
పోరంకిలోని తన గెస్ట్‌హౌస్‌లో కూడా ఎమ్మెల్యే పలు సెటిల్‌మెంట్లు
చేస్తుంటారని తెలిసిన వారు అంటున్నారు. సెలబ్రిటీలు వచ్చినపుడు ఎమ్మెల్యే
తన అనుచరులు, సహచరులతో కలసి వారికి విందు వినోదాలు ఏర్పాటు చేస్తుంటారని
తెలిసింది. ఇన్ని ఆధారాలున్నా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చి చంద్రబాబు
వారిని రక్షించే ప్రయత్నం చేయడంపై ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు
మండిపడుతున్నారు. 

చంద్రబాబు సిగ్గుచేటు
కాల్
మనీ ముఠా గురించి రెండు నెలల కిందట బాధితులు చంద్రబాబు ముందు తమ గోడు
వెళ్లబోసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆకారణంగానే పాపం పండి టీడీపీ
నేతల బండారం బట్టబయలయిందని..దీంతో, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో
తెలియకుండా మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రజలు, ప్రతిపక్షాలు
దుమ్మెత్తిపోస్తున్నాయి. దోషులను వెనకేసుకొస్తూ  కాల్ మనీని పసిగట్టడంలో
విఫలమయ్యారంటూ చంద్రబాబు అధికారులను ఆడిపోసుకోవడం దారుణమన్నారు. బాధ్యత గల
ముఖ్యమంత్రి అయి ఉండి బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి...టీడీపీ నేతలను
కేసు నుంచి కాపాడే ప్రయత్నం పట్ల చంద్రబాబుపై మండిపడుతున్నారు.  

బినామీలతో ఇసుక దందా..
పెనమలూరు
మండలం పెద్దపులిపాక ఇసుక క్వారీల్లో బోడే ప్రసాద్  పలువురు బినామీలను
ఏర్పాటుచేసుకొని ఇసుక దందా కొనసాగిస్తున్నారు. అలా వచ్చిన డబ్బునే ఆయన
కాల్‌మనీ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేవాడని వినిపిస్తోంది. ఎమ్మెల్యే
ప్రసాద్ అనుచరులే నేరుగా టిప్పర్లకు పొక్లెయిన్‌ల ద్వారా ఇసుకను నింపేవారు.
 నాలుగున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను టిప్పర్లలో నింపడం ద్వారా
ఎమ్మెల్యే బినామీల అకౌంట్లకు కోట్లాది రూపాయాలు జమ అయ్యాయి. ఇప్పటికీ
 ఎమ్మెల్యే అనుచరులే ఇసుకను లారీలు, టిప్పర్లలోకి నింపుతున్నారు. 

బోడె ముడుపులు
యనమలకుదురులో
పంచాయతీ అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన బిల్డర్ల వద్ద నుంచి ఎమ్మెల్యే
దాదాపు రూ.కోటికి పైగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. శాసనసభ్యుడిగా అర్హత
లేని బోడె ప్రసాద్ గతేడాది దూరవిద్య ద్వారా డిగ్రీ పొందేందుకు ఓ వ్యక్తితో
పరీక్ష రాయించడం అప్పట్లో సంచలనం  రేపింది. అయినా ఇంతవరకు దానిపై ఎలాంటి
కేసు లేదు. పోరంకిలో రెండు సినిమా హాళ్లు, ఇబ్రహీంపట్నం దొనబండలో క్రషర్స్,
పోరంకిలో 2 ఎకరాల విలువైన భూమి (రూ.20 కోట్లు), అతిథి గృహం, ఇల్లు
ఉన్నాయి.  ప్రస్తుతం పోరంకిలో అపార్టుమెంట్ నిర్మాణం చేస్తున్నాడు. గతంలో
ప్రైవేటు బస్సులు, లారీలు ఉండేవి. 
Back to Top