కుంభకోణాల ప్రభుత్వం

అవినీతిలో పోటీ పడుతున్న తెలుగుతమ్ముళ్లు
18నెలల్లో విచ్చలవిడి దోపిడీ
వేలకోట్ల రూపాయల కుంభకోణం
రోజుకో అవినీతి బండారం బట్టబయలు
కరప్షన్ కింగ్..చంద్రబాబు

టీడీపీ
సర్కార్ అవినీతి తారాస్థాయికి చేరింది. వేల కోట్ల కుంభకోణాలు, రోజుకో
అవినీతి వ్యవహారం బట్టబయలవుతోంది. తెలుగుతమ్ముళ్లు అవినీతిలో విచ్చలవిడిగా
పోటీ పడుతున్నారు. దందాలో వాటాల లెక్కలు తేలక రచ్చకెక్కుతున్నారు.  టీడీపీ
ఎంపీ సీఎం రమేష్ అవినీతిని మంత్రి దేవినేని ఉమ బయటపెడితే, మంత్రి ముడుపుల
వ్యవహారాన్ని సీఎం రమేష్ లేఖ ద్వారా బండారం బట్టబయలు చేశాడు. స్వయంగా సొంత
పార్టీ నేతలే తమ దోపిడీ విధానాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నా చంద్రబాబు
కిమ్మనడం లేదు. తెలుగుతమ్ముళ్ల అవినీతి వసూళ్లలో చంద్రబాబుకు వాటాలు
అందుతున్నందునే నోరు మెదపడంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

చంద్రబాబే
తెరవెనుక అన్నీ తానై నడిపిస్తూ అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి
పోషిస్తున్నారని ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు
సర్కార్ అవినీతి గురించి ఆది నుంచి వైఎస్సార్సీపీ బయటపెడుతూనే ఉంది.
 అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో పచ్చచొక్కాలు సాగిస్తున్న దందాలు,
దోపిడీలు, దౌర్జన్యాలు, అవినీతి గురించి ఎక్కడిక్కడ ఎండగడుతూ వస్తోంది.
రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ పచ్చనేతలు విచ్చవిడిగా దోపిడీకి పాల్పడుతున్న
వైనాన్ని నిగ్గు తేల్చింది. చంద్రబాబు మార్క్ అవినీతి, అక్రమాలు, అరాచకాలను
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ప్రజాక్షేత్రంలో
నిలదీస్తూనే ఉన్నారు.  

అయినవాళ్లకు అప్పనంగా
దోచిపెడుతున్న చంద్రబాబు.. ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్న ప్రతిపక్షాలపై
పోలీసులను ఉసిగొల్పి దౌర్జన్య ఖాండ ప్రదర్శిస్తున్నారు. అడ్డొచ్చిన
అధికారులపై తెలుగుతమ్ముళ్లు దాడులకు తెగబడుతున్నారు.  మాట వినని అధికారులపై
బదిలీ వేటు వేస్తున్నారు. 18 నెలల పాలనలో 700 చీకటి జీవోలు తీసుకొచ్చి
..ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోచుకుంటూ రాష్ట్రంలో అనేక కుంభకోణాలకు
పాల్పడుతున్నారు.అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అనేక కుంభకోణాలకు
పాల్పడిన ప్రభుత్వమేదైనా ఉందంటే అది టీడీపీయేనని విశ్లేషకులు
మండిపడుతున్నారు. చంద్రబాబు జమానాలో పడగెత్తిన అవినీతిపై నిప్పులు
గక్కుతున్నారు.

రాష్ట్రంలో టీడీపీ
భూదోపిడీకి అంతే లేదు. రాజధాని , ఎయిర్ పోర్ట్, సీ పోర్ట్ అంటూ వేలాది
ఎకరాల రైతుల భూములను బలవంతంగా లాక్కొని..చంద్రబాబు తన రియల్ ఎస్టేట్
వ్యాపారం కోసం వాటిని సింగపూర్ కు మళ్లించారు.తద్వారా లక్షల కోట్ల
అవినీతికి పాల్పడ్డారు. అంతేగాకుండా బామ్మర్ది బాలకృష్ణ, ఆయన వియ్యంకులు,
అనుచరులకు చంద్రబాబు వందలాది ఎకరాల భూములను అప్పనంగా దోచిపెట్టారు. ఇక
ప్రాజెక్ట్ పనుల్లో అవినీతి ఏరులై పారుతోంది.

పెదబాబు,
చినబాబు, తమ్ముళ్ల కుంభకోణాలు..ఇసుక దందాల్లో రూ. 5,169 కోట్ల దోపిడీ,
పరిశ్రమలకు అదనపు రాయితీల పేరుతో రూ.5 వేల కోట్లు, పోలవరంలో రూ.3 వేల
కోట్లు, పెన్షన్లలో రూ.900 కోట్లు అవినీతి వసూళ్లు, పట్టిసీమ పేరుతో రూ.
700 కోట్లు లూటీ, నీరు-చెట్టు పథకంలో రూ. 100 కోట్ల కుంభకోణం, కుప్పం
బ్రాంచ్ కెనాల్ లో రూ. 100 కోట్ల కుంభకోణం. ఇంతింతై, వటుడింతై అన్నట్లు
చంద్రబాబు కరప్షన్ ఖండాంతరాలు దాటిపోయింది. 
Back to Top