ప్ర‌త్యేక హోదా కోసం ఆర్త నాదాలు

ప్ర‌త్యేక హోదా కోసం బ‌లిదానాలు
యువ‌కుల్లో తీవ్ర ఆందోళ‌న‌
ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వు

హైద‌రాబాద్‌: రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా వ‌స్తే జ‌న జీవ‌నంలో ఆనందం వ‌స్తుంద‌ని అంతా అంచ‌నా వేశారు. కానీ, చంద్ర‌బాబు చేసిన నిర్వాకంతో ప్ర‌త్యేక హోదా వ‌చ్చే జాడ క‌నిపించ‌క పోవ‌టంతో యువ‌త‌లో నిరాశ నిస్పృహ‌లు ఎక్కువ అవుతున్నాయి.

బ‌లిదానాలు
ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీ తీవ్రంగా పోరాడుతున్నా, అధికార ప‌క్షం తెలుగుదేశంలో పెద్ద‌గా చ‌ల‌నం క‌న్పించ‌టం లేదు. ఈ పరిస్థితి చూసి తిరుపతిలో మునికోటి అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌ర్వాత నెల్లూరు జిల్లా వేదాయ‌పాళెం గ్రామానికి చెందిన ల‌క్ష్మ‌య్య ప్ర‌త్యేక హోదా కోరుతూ ఉరి వేసుకొని చ‌నిపోయాడు. ఈ మేర‌కు సూసైడ్ నోట్ రాశాడు. అటు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి గ్రామానికి చెందిన రాజ‌శేఖ‌ర్ ప్ర‌త్యేక హోదా రావ‌టం లేద‌న్న బెంగ‌తో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఇదే జిల్లాకు చెందిన కైక‌రం గ్రామంలో ప్ర‌సాద్ అనే వ్య‌క్తి ఆత్మాహుతికి య‌త్నించాడు. ఆయ‌న్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

యువ‌కుల్లో తీవ్ర ఆందోళ‌న‌
అడ్డ‌గోలు విభ‌జ‌న తో రాష్ట్రం చాలా కోల్పోయింది. చంద్ర‌బాబు అధికారం చేప‌ట్ట‌డంతో ప్ర‌భుత్వ ఉద్యోగాలు రావ‌న్న సంగ‌తి రూఢి అయింది. తొమ్మిదేళ్ల పాల‌న‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌కుండా ఏ విధంగా వేధించారో అంద‌రికీ తెలిసింది. పోనీ, ప్ర‌త్యేక హోదాతో పరిశ్ర‌మ‌లు త‌ర‌లి వ‌చ్చి, ప్రైవేటు ఉద్యోగాలు వ‌స్తాయ‌నుకొంటే, ఆ ఆశ‌లు కూడా అడుగంటుతున్నాయి. దీంతో యువ‌కులు నిస్పృహ‌కు గుర‌వుతున్నారు.

ప్ర‌తిప‌క్ష‌మే భ‌రోసా
ఇంత జ‌రుగుతున్నా ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న క‌ర‌వు. బాద్య‌త గ‌ల ప్ర‌తిప‌క్షంగా వైఎస్సార్ సీపీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల త‌రపున ఉద్య‌మిస్తోంది. ఆత్మాహుతి య‌త్నాలు వ‌ద్ద‌ని, పోరాటం ద్వారా సాధించుకోవ‌చ్చ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చెబుతున్నారు. 
Back to Top