చంద్ర‌బాబు పాపం.. నిరుపేద‌ల‌కు శాపం

విద్యార్థుల‌కు నాసిర‌కం భోజ‌నం
బ‌డికి దూరం అవుతున్న పిల్లలు
చంద్ర‌బాబు నిర్ల‌క్ష్య‌మే విద్యార్థుల‌కు శాపం

హైద‌రాబాద్: నిత్యావ‌స‌ర స‌ర‌కుల ధ‌ర‌లు భ‌గ్గుమంటుంటే ప్ర‌భుత్వం చోద్యం చూస్తోంది. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు... త‌ర్వాత కాలంలో దీన్ని గాలికి వ‌దిలేశారు. దీంతో సామాన్యుడికి బ‌తుకు భ‌రోసా దొర‌క‌డం లేదు. అటు, పేద విద్యార్థులు  అర్ధాకలితో అలమటిస్తున్నాయి. సరైన భోజనం పెట్టకపోవడంతో  పిల్లలు కడుపుమాడ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణకు విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.  ప్రాథమిక పాఠశాల  విద్యార్థికి రూ.4.60, ప్రాథమికోన్నత, ఉన్నత  పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 6.38 తో పాటు అదనంగా బియ్యం ఇస్తారు. ఐతే, నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో   పరిస్థితి దారుణంగా తయారైంది.  ప్రభుత్వం భోజనానికి  చెల్లించే రూ.4 దేనికి సరిపోతాయని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఫ‌లితంగా మ‌ధ్యాహ్న భోజ‌నం నాసిర‌కంగా ఉండ‌టంతో బ‌డుగు వ‌ర్గాల ప్ర‌జ‌లు బ‌డికి దూరం అవుతున్నారు. 
 
సర్కార్ నిర్లక్ష్యం..!
విద్యార్థులకు సరైన పోషకాలు అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. హాస్టల్ విద్యార్థులకు 3 నుంచి 10వ తరగతి వరకు రోజుకు..రూ. 25 నుంచి రూ.28 ఖర్చు అవుతోంది. భోజనంలో కోడిగుడ్లు, రాగిజావ, వేరుశనగ, గుగ్గిళ్లు, అరటిపండు లాంటి పోషకాలు అందించాలి. కానీ అవేమీ విద్యార్థులకు అందడం లేదు.  నాణ్యత లేని బియ్యం, నీళ్లచారు,మజ్జిగ లాంటివి పెడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు.

ధరల కట్టడిలో ప్రభుత్వం విఫలం...!
నిత్యవసర వస్తువుల ధరలు మండుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ధరలను కట్టడి చేయడంలో ఘరంగా విఫలమైంది. అదుపులోకి తీసుకొచ్చేందుకు  ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆఊసేలేదు. దీంతో,అది సంక్షేమ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.   కడుపు మాడుతుండడంతో పిల్లలు చదువుకు దూరం కావల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.  ఇకనైనా ప్రభుత్వం మేల్కొని పేద,వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Back to Top