వైఎస్ జ‌గ‌న్ స‌భ‌లో ఉంటే ఒక‌లా..! లేక పోతే మ‌రొక‌లా..!

హైద‌రాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీలో ఒక విషయం స్ప‌ష్ట‌మైంది. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ ను నేరుగా ఎదుర్కొలేక ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కంగారు ప‌డ్డారు. ఆయ‌న మంత్రివర్గ స‌హ‌చ‌రులదీ అదే ప‌రిస్థితి. వైఎస్ జ‌గ‌న్ లేన‌ప్పుడు స్వ‌రం గ‌ట్టిగా వినిపించిన చంద్ర‌బాబు, ఆయ‌న స‌భ‌కు హాజ‌రు అయ్యాక మాత్రం బీరాలు పోయారు. 

అయిదు రోజుల స‌భ‌లో ప్ర‌భుత్వ వైఖ‌రి అంతే..!
అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద ప్ర‌శ్నించ‌టం ప్ర‌తిప‌క్షం వంతు అయితే, వాటి మీద ప‌లాయ‌నం సాగించ‌టం ప్ర‌భుత్వం వంతు అయింది. ఒక్కటంటే ఒక్క అంశం మీద సూటిగా జ‌వాబు చెప్ప‌లేకపోయింది. ప్ర‌త్యేక హోదా కు అనుకూల‌మా, వ్య‌తిరేకమా అని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ నిగ్గ‌దీసి ప్ర‌శ్నిస్తే, దానికి స‌మాధానం వ‌స్తే ఒట్టు. ప‌ట్టిసీమ అక్ర‌మాల పుట్ట కాద‌న‌గ‌ల‌రా అంటే జ‌వాబు లేదు. ఓటుకి కోట్లు కుంభ‌కోణంలో ఉన్నారా లేదా అంటే జ‌వాబు చెప్ప‌కుండా వాయిదాలు వేయించుకొని పారిపోయారు.

జ‌గ‌న్ లేనప్పుడు మాత్ర ప్ర‌తాపం
ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ స‌భ‌లో లేన‌ప్పుడు మాత్రం ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కంగారు పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. ప‌ట్టి సీమ మీద మీ పార్టీ వైఖ‌రి ఏంటి అంటూ హ‌డావుడి చేశారు. స‌భ‌లో శాస‌న‌స‌భ ప‌క్ష నాయ‌కుడు లేనప్పుడు పార్టీ వైఖ‌రిని చెప్ప‌టం సాంప్ర‌దాయం కాదు. ఆ సంగ‌తి గుర్తెరిగి వైఎస్సార్‌సీపీ నాయ‌కులు మాట్లాడుతుంటే , అదేదో బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లు కొడుతున్న‌ట్లుగా చంద్ర‌బాబు ప‌దే ప‌దే ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించారు. శాస‌న‌స‌భ‌లో ఉన్న సాంప్ర‌దాయాల్ని తుంగ‌లోకి తొక్కి మ‌రీ చెల‌రేగిపోయారు.

వైఎస్ జ‌గ‌న్ వ‌చ్చాక తోక ముడిచిన స‌ర్కారు
ప‌ట్టిసీమ మీద మీ వైఖ‌రి ఏమిటినే దానిపై ప‌దే ప‌దే ప్ర‌శ్నించిన చంద్ర‌బాబు తర్వాత రోజు మాత్రం పెద్ద‌గా గొంతు పెగ‌ల్చ‌లేక‌పోయారు. ఐదో రోజు ఓటుకి కోట్లు మీద మా వైఖ‌రి ఇది అంటూ ప్ర‌తిప‌క్షం గొంతెత్తి చాటితే సీఎం క‌నీసం స‌భ‌లోకి కూడా రాలేక‌పోయారు. చాంబ‌ర్ లో దాక్కొన్నారు. త‌ప్పితే వైఎస్ జ‌గ‌న్ కు ఎదురుప‌డే సాహసం చేయ‌లేక పోయారు. 
Back to Top