ప‌ట్టు ప‌ట్టి .. వ‌ట్టి సీమ తెస్తారా..

ప‌ట్టి సీమ‌తో క‌ష్టాలు
ముందునుంచీ వాదిస్తున్న వైఎస్సార్‌సీపీ
అసెంబ్లీలో గుదిగుచ్చి వివ‌రంచిన వైఎస్సార్‌సీపీ

హైద‌రాబాద్‌: ప‌ట్టి సీమ కోసం చంద్ర‌బాబు చేయ‌ని హ‌డావుడి లేదు. ప‌థ‌కం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి చంద్ర‌బాబు చ‌ప్ప‌ట్లు కొట్టించేసుకొన్నారు. ఈ రోజు అసెంబ్లీలో చ‌ర్చ సంద‌ర్బంగా ఇదే అంశాన్ని వైఎస్సార్‌సీపీ ప్ర‌స్తావించింది.

ప‌ట్టిసీమ‌తో ఎన్నో ఇబ్బందులు
ప‌ట్టి సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంలో రిజర్వాయ‌ర్ ప్ర‌స్తావ‌న లేనే లేదు. మ‌రి అటువంట‌ప్పుడు నీటిని ఎక్క‌డ నిల్వ చేస్తారు అన్న ప్ర‌శ్న‌కు జ‌వాబు దొర‌క‌టం లేదు. ఏడాది పొడ‌వునా గోదావ‌రికి వ‌ర‌ద నీరు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఏడాదిలో 2 నెల‌లు వ‌ర‌ద పొంగితే గొప్ప. మ‌రి మిగిలిన రోజుల్లో అర కొర‌గా వ‌స్తున్న నీటిని ప‌ట్టి సీమ ద్వారా తోడేసుకొంటే దిగువ‌న ఉన్న గోద‌వ‌రి జిల్లా ల ప‌రిస్థితి ఏమిట‌న్న దానికి జ‌వాబు లేదు. పైగా ఈ నీటిని తీసుకొని వెళ్లి రాయ‌ల సీమ‌కు ఇస్తామంటూ అస‌త్య ప్ర‌చారం చేసుకొంటున్నారు. పట్టి సీమ తో నీటిని ప్ర‌కాశం బ్యారేజ్ ద‌గ్గ‌ర పోస్తే, ఎగువ‌న ఉన్నరాయ‌ల సీమ కు నీళ్లు ఎలా వ‌స్తాయ‌న్న దానికి జ‌వాబు లేనే లేదు.

ముందు నుంచీ అదే ప్ర‌శ్న‌లు
ఇన్ని ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ ప‌ట్టి సీమ పూర్తి చేసేందుకు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఎన్నో తంటాలు ప‌డ‌సాగింది. కాంట్రాక్ట‌ర్ కు 21 శాతం అద‌నంగా చెల్లించేందుకు రంగం సిద్దం అయింది. ఈ కాంట్రాక్ట‌ర్ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ట్టు ప‌ట్టి మరీ ప‌ట్టి సీమ ను పూర్తి చేయించారు. ఆగ‌స్టు 15 నాటికి ప‌నులు పూర్తి చేస్తామ‌ని చెప్పి పూర్తి చేయ‌లేక‌పోయారు. ఇందుకుగాను ఉత్తుత్తి స్తూపం వేసి మ‌రీ జాతికి అంకితం  చేయించేశారు. తద్వారా కాంట్రాక్ట‌ర్ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.

అసెంబ్లీలో వాదించిన వైఎస్సార్‌సీపీ
ప‌ట్టి సీమ తో వ‌చ్చే అన‌ర్థాల గురించి మొద‌ట నుంచీ పోరాడుతున్న పార్టీ వైఎస్సార్‌సీపీ. ఈ న‌ష్టాల్ని అసెంబ్లీలో చర్చ సంద‌ర్భంగా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ జ్యోతుల నెహ్రూ వివ‌రించారు. పట్టి సీమ అన్న‌ది ఒక ధ‌నార్జ‌న ప‌థ‌కం అని ఆయ‌న అభివ‌ర్ణించారు. కాంట్రాక్ట‌ర్ కు మేలు చేసేందుకు ప్ర‌జా ధ‌నాన్ని ఖ‌ర్చు చేయిస్తున్నార‌ని ఆయ‌న ఉద‌హ‌రించారు. పూర్తి వివ‌రాలు స‌భ దృష్టికి తెచ్చిన‌ప్ప‌టికీ అధికార ప‌క్షం మాత్రం త‌న ప‌ట్టు నెగ్గించుకొనేందుకు ప్రాధాన్యం ఇచ్చింది.

తాజా ఫోటోలు

Back to Top