అసలు గుడివాడలో ఏమైంది..!

ఒక్కసారిగా తూర్పు క్రిష్ణా రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
కొడాలి నాని ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారన్న వార్త దశ దిశలా వ్యాపించింది.
తెలుగుదేశం నాయకుల మెప్పు కోసం పోలీసులు చేసిన ఓవరాక్షన్ ను క్రిష్ణా జిల్లా
వాసులు అసహ్యించుకొన్నారు.

క్రిష్ణా జిల్లా లో గుడివాడలో ఎమ్మెల్యే నానికి విశేష  ప్రజాదరణ ఉంది. ఇందుకు నిదర్శనం... వరుసగా
నియోజక వర్గంలో ఆయన గెలుస్తున్న తీరే. వ్యక్తిగతంగా నానికి ఉన్న పట్టు తో ఆ నియోజక
వర్గంలో ప్రత్యర్థుల పప్పులు ఉడకటం లేదు. దీంతో కొడాలి నాని మీద బురద జల్లేందుకు
పోలీసుల్ని ఉపయోగించుకొన్నారు.

గుడివాడ పట్టణంలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించాలని పన్నాగం
పన్నారు. భవన యజమాని చేత ఆఫీసు ఖాళీ చేయటం లేదని ఫిర్యాదు పుట్టించి, ఆ పై
పోలీసుల్ని ఉసిగొల్పారు. సుమారు 300 మంది పోలీసులు ఒక్కసారిగా పార్టీ ఆపీసులోకి
చొరబడి జెండా రంగులు మార్చేయటం మొదలెట్టారు. దీన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించినప్పుడు
ఎమ్మెల్యే కొడాలి నానిని అదుపులోకి తీసుకొన్నారు. ఎక్కడో దూరంగా ఉన్న కైకలూరు
పోలీసు స్టేషన్ కు తరలించారు. సాయంత్రం దాకా అక్కడ ఉంచి తర్వాత విడుదల చేశారు.

ఇక్కడ మౌళికంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

1.     అసలు సివిల్ తగాదాల్లో
పోలీసులు ఎందుకు తలదూరుస్తున్నట్లు. భవనం ఖాళీ చేసి వెళ్లటం అన్నది సివిల్
వ్యవహారం అన్న సంగతి తెలీదా

2.     భవన యజమాని దగ్గర నుంచి
ఫిర్యాదు వచ్చినప్పుడు స్టేషన్ హౌజ్ ఆఫీసరు (దర్యాప్తు అధికారి)దాని మీద విచారణ
జరపాలి కదా. రాత్రి ఫిర్యాదు వస్తే తెల్లవారేసరికి డీఎస్పీ నాయకత్వంలో పోలీసులు
విరుచుకు పడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.

3.     అదుపులోకి తీసుకొన్నప్పుడు
పాటించాల్సిన విధి విధానాలు పాటించలేదు ఎందుకని,సమీపస్తులకు సమాచారం అందించాలన్నా
ప్రాథమిక న్యాయ సూత్రాల్ని కూడా పాటించరా

4.     సమాచారం అందుకొని
ప్రశ్నించిన మాజీ మంత్రి పార్థసారధి మీద డీఎస్పీ చిందులు తొక్కటాన్ని ఎలా అర్థం
చేసుకోవాలి. పోలీసు యూనిఫామ్ ఉంటే ఏమైనా చేయవచ్చు అనుకొనే బరితెగింపు

5.     సివిల్ కేసుల విషయానికి,
క్రిమినల్ కేసుల విషయానికి తేడా ఉంటుంది. అటువంటప్పుడు శాసనసభ సభ్యుల విషయంలో ఏ
విధంగా ప్రవర్తించాలో పోలీసు ఉన్నతాధికారులకు తెలీదా

ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేని చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహారాలు
సాగిస్తోంది. పోలీసుల్ని పంపించి బెదిరింపులకు దిగుతోంది. ప్రతిపక్ష పార్టీల
నాయకులు, కార్యకర్తల్నివేధించేందుకు ఉసిగొల్పుతోంది. 

Back to Top