చింతమనేని చరిత్ర చూడ.. పెద్ద పెద్ద కేసులుండు..!

చంద్రబాబు నాయుడు
నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వానికి అసెంబ్లీ లో ఒక చీఫ్ విప్, ఇంకా అనేక మంది
విప్ లు ఉన్నారు. వీరెవ్వరికీ లేనంత పబ్లిసిటీ మాత్రం ప్రభుత్వ విప్ చింతమనేని
ప్రభాకర్ కు ఉంది. బెదిరించటం, కొట్టించటం, దౌర్జన్యాలు చేయటంలో ఆయన రికార్డును
ఆయనే తిరగరాసుకొంటున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా లోని
ఒక కుగ్రామం లో ఎంపీటీసీ గా చింతమనేని ప్రభాకర్ రాజకీయ నేపథ్యం ప్రారంభమైంది.అ
క్కడ నుంచి ఆయన ఎంపీపీ గా ఎదిగారు. ప్రభుత్వయంత్రాంగాన్ని లొంగదీసుకొంటేనే అవినీతి
ప్రస్థానం సక్రమంగా సాగుతుందని ఆయన గుర్తించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన స్థాయి
పరాకాష్టకు చేరిపోయింది. 2004 లో రెవిన్యూ అధికారి పెంచల్ రెడ్డి మీద చింతమనేని
దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ప్రభుత్వ అధికారులు భయపడిపోసాగారు. చింతమనేని
తో పెట్టుకొంటే లేనిపోని తలనొప్పులు అని, సాధ్యమైనంత వరకు దెందులూరు నియోజక
వర్గానికి పోస్టింగులే వద్దని పారిపోసాగారు. పెదవేగి మండల పోలీసుస్టేషన్ లో
ఆనందరావు, మోహనరావు, ఆంజనేయులు అనే సిబ్బంది మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
ఎకా ఎకిన పోలీసు స్టేషన్ మీద దాడి చేయటం, పోలీసుల్ని గాయపరుస్తుండటంతో చింతమనేనికి
అడ్డు అదుపు లేకుండా పోయింది. 2012 లో జిల్లా పంచాయతీ అధికారి వర ప్రసాద్ మీద
దాడికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

ఇప్పటికే చింతమనేని మీద
ఏలూరు పోలీసు యంత్రాంగం రౌడీ షీట్ ఓపెన్ చేసింది. రౌడీ నేపథ్యం, 20 కి పైగా కేసులు
ఉన్న చింతమనేని అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా ఇష్టం. అందుకే
తెలుగుదేశం పార్టీ అదికారంలోకి రాగానే చింతమనేని కి మంత్రి హోదా ఉండే విప్ పదవిని
ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో చింతమనేని రెచ్చిపోయారు అనటానికి నిదర్శనం.. మహిళా
తహశీల్దార్ వనజాక్షి మీద దాడికి పాల్పడటం. తమ్మిలేరు లో అక్రమంగా టన్నుల కొద్దీ
ఇసుకను చింతమనేని కొల్లగొట్టేస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. అయితే, దాన్ని
అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మహిళా తహశీల్దార్ వనజాక్షిని ఇసుక లో ఈడ్పించి, మరీ
కొట్టించటం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మహిళా అధికారిని ఈ
స్థాయిలో వేధిస్తే, రాష్ట్రంలోని మహిళా సంఘాలన్నీ పెద్ద ఎత్తున నిరసనలు తెలిపితే
చింతమనేని మీద ఈగ కూడా వాలలేదు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం పక్కన
చింతమనేని కూర్చొంటే.. అక్కడకు మహిళా తహశీల్దార్ వనజాక్షి ని పిలిపించి సీఎం
ఎదురుగా బెదిరించి పంపించారు. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం
అంతా హడలిపోయింది. తర్వాత కొల్లేరు ప్రాంతంలో దాదాపు 150 ఎకరాల దాకా చేపల
చెరువుల్ని చింతమనేని ఆక్రమించినట్లుగా చెబుతున్నారు. వీటికి సరైన రోడ్ మార్గం
లేకపోతే, అటవీ శాఖ నిబందనల్ని తుంగలోకి తొక్కి రాత్రికి రాత్రి రోడ్ వేయించారు. ఈ
సంగతి తెలుసుకొని అటవీ అధికారులు అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే వాళ్లను తరిమి తరిమి
కొట్టారు. తాజాగా అంగన్ వాడీ ఉద్యోగులు తమ సమస్యల్ని వెళ్లబోసుకోవటానికి
ప్రయత్నిస్తే .. రాయటానికి వీలు లేని భాషలో వాళ్లను తిట్టి పంపించారు. ఇంతటి
చరిత్ర ఉన్న నాయకుడు కాబట్టే చింతమనేని అంటే చంద్రబాబు కి తగని మక్కువ. అసలు కారణం
మాత్రం.. చింతమనేని చేసే చీకటి వ్యాపారాల్లో చంద్రబాబుకి వాటా ఉందని పశ్చిమగోదావరి
జిల్లాలో ప్రచారం ఉంది. 

Back to Top