అదిగదిగో రాజధాని అని ఊరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఈ దిశగా మొండిగా అడుగులు వేస్తున్నారు. పచ్చటి పంట పొలాల్ని లాక్కొన్న చంద్రబాబు అక్కడ ప్రజల్ని నిలువునా ముంచేశారు. ఇప్పుడు రాజధానికి పొంచి ఉన్నముప్పు గురించి పట్టించుకోకుండా.. అందరినీ ముంచబోతున్నారు.<br/>మొన్న చెన్నయ్ వరదల్లో అందరికీ ఒక విషయం తెలిసి వచ్చింది. భారీగా వానలు పడితే, చెన్నయ్ నగరం నుంచి వరద నీరు పక్కనే ఉన్న సముద్రంలోకి ఎందుకు వెళ్లిపోలేదు. నాలాలు, మురుగు నీటి వ్యవస్థ సక్రమంగా ఉంటే వెను వెంటనే ఇది జరిగి ఉండేది. సరిగ్గా ఈ అంచనా వేయకుండానే అమరావతి లో నిర్మాణాలు జరిగిపోతున్నాయనే మాట వినిపిస్తోంది. <br/>నిర్మాణం పూర్తయ్యే అమరావతిలో ఒక నది, కృష్ణా పశ్చిమ కాలువ ఉంటాయి. మన ప్రభుత్వాధినేతలు ఊహించినట్లు అమరావతి పెరిగిపోతే, అది ఒక్కరోజులో 20 సెంటీమీటర్ల వర్షం కురిసినా ఆ నీటిని పీల్చుకోలేదు. పై గా అది సారవంతమైన ఒండ్రు మట్టి కాబట్టి నీరు అలాగే ఉండిపోతుంది తప్పితే, నేలలోకి దిగే అవకాశాలు చాలా తక్కువ. <br/>మరోవైపు, నదికి పరిసరాలలో భూ గర్భంలో కొన్ని పాయలు ప్రవహిస్తుంటాయని, ఆ పాయల ఉపరితలంలోని భూమిపై ఎలాంటి నిర్మాణాలు కట్టకూడదని సూచిస్తున్నారు. రాజధాని అందుకే అమరావతిలో భారీ నిర్మాణాలు కట్టేముందు క్షుణ్ణంగా జియాలజిస్ట్‌లచేత పరీక్షలు చేయించాలని అంటున్నారు. కానీ, ఈ మాటలు వినేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరన్న మాట వాస్తవం. సింగపూర్ కంపెనీల కోసమే రాజధాని నిర్మిస్తున్నందున ప్రజల ప్రయోజనాలు పట్టించుకొనే పరిస్థితి ఉండనే ఉండదు.