ముఖ్య‌మంత్రి అక్ర‌మ నివాసం

అక్రమభవంతినే కొంపగా మార్చుకున్న కరప్షన్ కింగ్...!

కొన్ని రోజుల క్రితం అక్ర‌మ నిర్మాణం అంటూ నోటీసులు
ఇప్పుడు అంతా స‌క్ర‌మం అంటూ హంగులు
లీజుకు లింగమనేని ఎస్టేట్స్ ..ప్రతిగా  బంపర్ ఆఫర్....!

హైద‌రాబాద్‌: రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అరాచకాలకు అడ్డే లేకుండా పోతుంది. చంద్రబాబు మరో అవినీతి బాగోతానికి తెరదీశారు. అక్రమంగా కట్టిన భవంతిలో అడుగుపెట్టి కరప్షన్ కింగ్ అనిపించుకున్నారు. అక్రమ కట్టడాలంటూ లింగమనేని ఎస్టేట్స్ తో పాటు మరికొందరి భవనాలను కూల్చేందుకు గతంలో ప్రభుత్వం నోటీసులిచ్చింది. ఇప్పుడు  అదే భవంతిని చంద్రబాబు  అనధికారికంగా రెండేళ్లపాటు సీఎం నివాసానికి లీజుకు తీసుకున్నాడు. ఇందుకు ప్రతిగా లింగమనేని గ్రూప్ కు భారీ నజరానా ప్రకటించాడు. నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో 500 ప్లాట్లను అద్దెకు తీసుకొని....ఒక్కో ఫ్లాట్ కు నెలకు అద్దె రూ.40 వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 

కూల్చేస్తామంటూ రంకెలేసి కామైపోయిన దేవినేని..!
లింగమనేని ఎస్టేట్స్ అధినేత రమేష్ కు కృష్ణా నది ఒడ్డున 1.31 ఎకరాల భూమి ఉంది. 2007లో స్విమ్మింగ్ ఫూల్ కట్టాలని చెప్పి నీటిపారుదలశాఖ నుంచి అనుమతి తీసుకొని ..రెండంతస్తుల భవంతి కట్టారు. కృష్ణా కరకట్ట లోపల అక్రమంగా 22 కట్టడాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని కూల్చేందుకు నోటీసులు ఇచ్చింది. అక్రమ కట్టడాలన్నంటిపై చర్యలు తీసుకుంటామంటూ  అప్పట్లో  రంకెలేసిన మంత్రి దేవినేని ఉన్నట్లుండి కామైపోయారు.  అక్రమభవంతిలో మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ.20 కోట్లకుపైగా ఖర్చు చేస్తూ చంద్రబాబు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. 
  
ఇంటి రోడ్డు కోసం  రైతుల భూములు లాక్కున్నచంద్రబాబు !
అధికారాన్ని అడ్డం పెట్టుకొని  చంద్రబాబు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. అడిగేవారెవరూ లేరని చెలరేగుతున్నాడు. రాష్ట్రంలో సమస్యలన్నీ గాలికొదిలేసి ..రాజభోగాల కోసం రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నాడు. రాష్ట్రంలో  కరెంట్ లేక జనం  అవస్థలు పడుతుంటే...కొత్త ఇంటికోసం  3.30కోట్లతో ప్రత్యేకంగా 33 కేవీ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుంటున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా  రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా చలించని చంద్రబాబు...అవినీతి భవంతి కోసం 13 కిలోమీటర్ల మేర ఆఘమేఘాల మీద రోడ్డు పనులు చేయిస్తుండడం దురదృష్టకరం. రోడ్డు నిర్మాణం కోసం రూ.111కోట్లు మంజూరు చేశారంటే చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.  రోడ్డుకోసం  ముగ్గురు రైతుల భూములను  భూసమీకరణ కింద లాగేసుకుని వారిని రోడ్డున పడేశాడు. కోట్ల రూపాయలను కొల్లగొడుతూ..అక్రమార్కులకు అండగా నిలుస్తూ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్న చంద్రబాబు కుటిలబుద్ధిని ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
Back to Top