చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి దొమ్మరి పనులు..!

ఎవరిని ఉద్ధరించడానికి జీవో తీసుకొచ్చావు..!
ప్రతిపక్షంలో ఓ విధానం, అధికారంలో ఉంటే మరో విధానమా..!
చంద్రబాబు చేష్టలను ప్రపంచమంతా చూస్తోంది..!

హైదరాబాద్ః
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తూ జీవో జారీ చేయడంపై వైఎస్సార్సీపీ సాలూరు
ఎమ్మెల్యే రాజన్నదొర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
బాక్సైట్ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పిన నీవు..అధికారంలోకి వచ్చాక
చేస్తున్నదేంటని చంద్రబాబును ప్రశ్నించారు. గిరిజన ప్రాంతంలో బాక్సైట్, ఇతర
హక్కులను ఆదివాసీలకు ఇచ్చేస్తానంటూ  చంద్రబాబు విడుదల చేసిన 25 అంశాలతో
కూడిన విధాన పత్రాన్ని, బాక్సైట్ తవ్వకాలు జరపొద్దంటూ గవర్నర్ కు ఆయన రాసిన
లేఖను రాజన్నదొర మీడియా ముందుంచారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకునేందుకు
గిరిజనులతో కలిసి విల్లంబులు పట్టుకొని ఉద్యమిస్తానన్న చంద్రబాబు....చెప్పే
మాటలు, చేసే పనులను ప్రపంచమంతా చూస్తోందన్నారు. 

ఏ ఒక్కటైనా చేశారా..!
ఎవరిని
ఉద్ధరించడానికి జీవో 97 రిలీజ్ చేశారో చెప్పాలని రాజన్నదొర ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓవిధానం, ఇప్పుడు ఓ
విధానమా...అప్పుడు గిరిజనులు బంధువులు, ఇప్పుడేమో శత్రువులా అని నిలదీశారు.
ఇల్లు లేని గిరిజనులకు రూ.లక్షా 50వేలు ఇస్తామన్నారు.  ఒక్క ఇల్లు అయినా
కటట్టించారా అని ప్రశ్నించారు. గిరిజన తండాలకు మౌలిక సదుపాయాలు
కల్పిస్తామన్నారు. ఆడపిల్లలకు రూ.50వేలు ఇస్తామన్నారు. నామినేటెడ్
పోస్టులకు గిరిజనుల ప్రాతిపదికన ఇస్తామన్నారు. జిల్లాకో గిరిజన భవనం
అన్నారు. తమ సంస్కృతి.. సంప్రదాయాలకు పూజాల కోసం నెలకు రూ.5 వేలు
ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్కటీ చేయకపోగా ఉన్న సంపదను దోచుకుంటారా అని
నిలదీశారు. 

రెండు కళ్ల సిద్ధాంతం..!
బాక్సైట్
తవ్వటానికి వీల్లేదంటూ 24-12-2011న గవర్నర్‌కు లేఖ రాసిన
చంద్రబాబు..ఇప్పుడు జీవో జారీ చేయడం వెనుక ఉద్ధేశ్యమేంటో చెప్పాలన్నారు.
గిరిజనులు బతకకూడదా అని ప్రశ్నించారు. పంచాయతీ, గిరిజన సలహా మండలి తీర్మానం
లేకుండా బాక్సైట్ తవ్వకాలు జరిగితే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు.
ఇంతవరకు గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయలేదు. బాక్సైట్ తవ్వితే నదులు
ఎండిపోతాయి.. పర్యావరణం పాడైపోతుందని చెప్పారు. ఇవన్నీ చెప్పి అధికారంలోకి
వచ్చాక గిరిజనులను ఇబ్బందులు పెట్టడం సమంజసం అని ప్రశ్నలు సంధించారు.
బాక్సైట్ తవ్వకాలను అడ్డుకొని తీరతామని, మన్యం ప్రజల మనోవేధన
తెలియజెప్పేందుకే ప్రెస్ మీట్ పెట్టినట్లు రాజన్నదొర స్పష్టం చేశారు.
Back to Top